దేవేగౌడ కుటుంబ రాజకీయ అంతానికి 600 కోట్ల డీల్
ABN , Publish Date - Oct 26 , 2026 | 06:42 AM
మాజీ ప్రధాని దేవేగౌడ కుటుంబాన్ని రాజకీయంగా అంతం చేసేందుకు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ రూ.600 కోట్ల భారీ డీల్‌కు పాల్పడ్డారనే విషయంలో ఎలాంటి అనుమానం లేదని కేంద్రమంత్రి కుమారస్వామి సంచలన ఆరోపణ చేశారు.
కర్ణాటక సీఎంపై కుమారస్వామి ఆరోపణ
బెంగళూరు, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని దేవేగౌడ కుటుంబాన్ని రాజకీయంగా అంతం చేసేందుకు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ రూ.600 కోట్ల భారీ డీల్‌కు పాల్పడ్డారనే విషయంలో ఎలాంటి అనుమానం లేదని కేంద్రమంత్రి కుమారస్వామి సంచలన ఆరోపణ చేశారు. ‘మా కుటుంబాన్ని నిర్వీర్యం చేయాలనే కుతంత్రాలు అనేకం ఉన్నాయి. అందులో రూ.600 కోట్ల సుపారీ డీల్ కూడా ఒకటి’ అని కుమారస్వామి పేర్కొన్నారు. మరోవైపు, కర్ణాటకలో స్టింగ్ ఆపరేషన్ వివాదాన్ని జేడీఎస్ పార్టీకి అంటగట్టేందుకు సీసీబీ, హోంశాఖలు వ్యవస్థీకృతంగా కుట్ర పన్నుతున్నాయని కుమారస్వామి ఆరోపించారు.