క్షిపణుల అడ్డగింత దృశ్యాలు చిత్రీకరించొద్దు
ABN , Publish Date - Oct 26 , 2026 | 06:16 AM
సౌదీ అరేబియాలో నివసిస్తున్న భారతీయ పౌరులకు రియాద్‌లోని భారత ఎంబసీ కీలక ఆదేశాలు జారీ చేసింది
సౌదీలోని భారతీయులకు ఎంబసీ సూచన
దుబాయ్, అక్టోబరు 25: సౌదీ అరేబియాలో నివసిస్తున్న భారతీయ పౌరులకు రియాద్‌లోని భారత ఎంబసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. సౌదీ రక్షణ దళాలు క్షిపణులు, డ్రోన్లను అడ్డుకునే దృశ్యాలను చిత్రీకరించడం, అవి కూలిపోయిన ప్రాంతాల వివరాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం వంటి పనులు చేయవద్దని సూచించింది. సౌదీలోని సివిల్ డిఫెన్స్ నిబంధనల ప్రకారం భారత ఎంబసీ ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం.. వైమానిక దాడులకు సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లేదా ఇతరులకు ఫార్వర్డ్ చేయడం పూర్తిగా నిషేధం. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే సౌదీ సైబర్ క్రైమ్ చట్టాల ప్రకారం భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష వంటి చట్టపరమైన చర్యలు ఉంటాయని ఎంబసీ స్పష్టం చేసింది. మరోవైపు, ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు ఆటంకం ఏర్పడింది. రియాద్, దమ్మామ్ నగరాలకు సర్వీసులను నవంబర్ 7 వరకు, అలాగే జెడ్డా సర్వీసులను ఈనెల 31 వరకు రద్దు చేస్తున్నట్లు ఎంబసీ వెల్లడించింది.