నిరవధిక సమ్మెకు ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల హెచ్చరిక
ABN , Publish Date - Oct 26 , 2026 | 06:30 AM
కమీషన్లు, హోం డెలివరీ చార్జీలను సమగ్రంగా సవరించాలని డిమాండ్ చేస్తూ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు ఆందోళనకు సిద్ధమయ్యారు
న్యూఢిల్లీ, అక్టోబరు 25: కమీషన్లు, హోం డెలివరీ చార్జీలను సమగ్రంగా సవరించాలని డిమాండ్ చేస్తూ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు ఆందోళనకు సిద్ధమయ్యారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే దేశవ్యాప్త నిరవధిక సమ్మె చేపడతామని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్(ఇండియా) హెచ్చరించింది. సోమవారం న్యూఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్‌లో ధర్నా, నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు బి.ఎ స్.శర్మ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. డిస్ట్రిబ్యూటర్ల కమీషన్లు, ఇతర చార్జీలను సవరించాలన్న డిమాండ్ ఎనిమిదేళ్లకు పైగా పెండింగ్‌లో ఉందన్నారు. గోదాం నుంచి వినియోగదారుడి ఇంటికి సిలిండర్ చేరవేసేందుకు రూ.35 మాత్రమే చెల్లిస్తున్నారని పేర్కొన్నారు.