నేడు ఆర్థిక వ్యవస్థలపైనా యుద్ధాలు!
ABN , Publish Date - Oct 26 , 2026 | 07:09 AM
నేటి కాలంలో ఆయుధాలతో సంప్రదాయ యుద్ధాలు మాత్రమే జరగవని, ఆర్థిక వ్యవస్థలపైనా యుద్ధాలు జరుగుతాయని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు
సైబర్ టెర్రరిస్టులతో బ్యాంకింగ్ వ్యవస్థకు ముప్పు: మోదీ
భువనేశ్వర్, అక్టోబరు 25 : నేటి కాలంలో ఆయుధాలతో సంప్రదాయ యుద్ధాలు మాత్రమే జరగవని, ఆర్థిక వ్యవస్థలపైనా యుద్ధాలు జరుగుతాయని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. అందువల్ల దేశ బ్యాంకింగ్ వ్యవస్థను సైబర్ టెర్రరిస్టుల బారి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. భువనేశ్వర్‌లో రూ.169 కోట్లతో ఏర్పాటు చేసిన ఆర్బీఐ డేటా సెంటర్, సైబర్ సెక్యూరిటీ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్‌లను ప్రధాని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థలపై దాడులతోనూ ఒక దేశాన్ని బలహీనపరచవచ్చని చెప్పారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతున్న ఈ తరుణంలో మన బ్యాంకింగ్ వ్యవస్థను సైబర్ క్రిమినల్స్, సైబర్ టెర్రరిస్టుల దాడుల నుంచి కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. కాలం చెల్లిన విధానాలు, శిక్షణ, టూల్స్‌తో వీటిని ఎదుర్కోలేమని వివరించారు. అందుకు ఆధునిక వ్యవస్థలు, నైపుణ్యం గల మానవ వనరులు తప్పనిసరి అని పేర్కొన్నారు.