సిద్దరామయ్యను నేను కలవనేలేదు
ABN , Publish Date - Oct 26 , 2026 | 06:46 AM
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్దరామయ్యపై స్టింగ్ ఆపరేషన్ జరిగినట్టు వస్తున్న ఆరోపణల్లో బాధితురాలిగా భావిస్తున్న మహిళ.. సీసీబీ పోలీసుల ముందు ఆదివారం హాజరయ్యారు
సీసీబీ ముందు స్టింగ్ ఆపరేషన్
‘బాధితురాలి’ వెల్లడి!
బెంగళూరు, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్దరామయ్యపై స్టింగ్ ఆపరేషన్ జరిగినట్టు వస్తున్న ఆరోపణల్లో బాధితురాలిగా భావిస్తున్న మహిళ.. సీసీబీ పోలీసుల ముందు ఆదివారం హాజరయ్యారు. తానెప్పుడూ సిద్దరామయ్యను కలవనే లేదని, సిద్దరామయ్య తనను ఏ విధంగానూ ఇబ్బంది పెట్టలేదని, లైంగిక దౌర్జన్యం వంటివి జరగలేదని ఆమె పోలీసులకు వివరించినట్టు సమాచారం. కొందరు వ్యక్తులు మాట్లాడమన్నట్లుగానే ఆ వీడియోలో మాట్లాడానని, అంతకు మించి ఏమీ తెలియదని ఆమె తెలిపారు. ఈ వివాదంలో ఎటువంటి ఫిర్యాదు చేయనని, న్యాయపోరాటం కొనసాగించనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో, ఈ వివాదం రాజకీయంగా మరో మలుపు తీసుకుంది.