మీవే ద్వంద్వ ప్రమాణాలు.. బీజేపీపై కాంగ్రెస్ మండిపాటు
ABN , Publish Date - Oct 26 , 2026 | 08:33 AM
‘మోదీ కా బాప్’ అంటూ బిహార్ రాజధాని పట్నాలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై మంటలు చల్లారడం లేదు. ‘మోదీ కా బాప్ భీ జాయేగా’ (మోదీ నాన్న కూడా వెళ్లిపోతారు) అంటూ ఖర్గే చేసిన వ్యా్ఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ‘మోదీ కా బాప్’ అంటూ బిహార్ రాజధాని పట్నాలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై మంటలు చల్లారడం లేదు. ‘మోదీ కా బాప్ భీ జాయేగా’ (మోదీ నాన్న కూడా వెళ్లిపోతారు) అంటూ ఖర్గే చేసిన వ్యా్ఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మొదట బీజేపీ నేతలు ఖర్గేకు కౌంటర్ వేయగా.. తాజాగా కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీపై ఎదురుదాడి చేశారు. బిహార్ తొలి ముఖ్యమంత్రి శ్రీకృష్ణ సింగ్ జయంతి సభలో ఖర్గే ప్రసంగిస్తూ సర్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని మాట్లాడుతుండగా.. సభలో ఉన్న ఒక వ్యక్తి ‘తిరుగుబాటు జరిగే వరకు మోదీ పదవి నుంచి దిగిపోరు’ అని అరిచారు. దానికి ఖర్గే స్పందిస్తూ.. ‘మోదీ నాన్న కూడా వెళ్లాల్సిందే’ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఎన్డీయే నేతలు ఖర్గేపై తీవ్రస్థాయిలో మండిపడగా.. తాజాగా కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీపై ఎదురుదాడి చేశారు. బీజేపీవి ద్వంద్వ ప్రమాణాలని ఖర్గే ‘ఎక్స్’లో అన్నారు.
‘ఈ ఏడాది ఆగస్టు 8న కాంగ్రెస్ బహిరంగ సమావేశం తర్వాత బీజేపీ, ఆర్ఎస్ఎస్ శుద్ధీకరణ పూజ చేశాయి. అలా చేయడంపై చర్యలు తీసుకుంటామని బీజేపీ నేత జేపీ నడ్డా పార్లమెంటులో హామీ ఇచ్చారు. కానీ, తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బదులుగా రాహుల్ గాంధీపైనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒకవైపు రాజ్యాంగాన్ని కాపాడతామని ప్రధాని నరేంద్ర మోదీ అంటారు. మరోవైపు అంటరానితనాన్ని ఆచరించే వారినే మీరు (బీజేపీ) కాపాడుతారు’ అని ఖర్గే అన్నారు.
ఖర్గే వ్యాఖ్యల్లో తప్పేముంది?
మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యల్లో అసభ్యకరమైన భాష ఎక్కడుందని కాంగ్రెస్ లీడర్ భూపేష్ బఘేల్ ప్రశ్నించారు. ఖర్గే మాట్లాడుతుండగా.. సభలో ఒక వ్యక్తి లేచి ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారని, దీంతో ఖర్గే అలా సమాధానం ఇచ్చారని బఘేల్ అన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై ప్రధాని మోదీ ఎన్నోసార్లు అసభ్యకర భాషను వాడారని, రూ.50 కోట్ల గర్ల్‌ఫ్రెండ్, జెర్సీ ఆవులు, మంగళసూత్రం అంటూ అవమానించారని గుర్తుచేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ గతంలో ఖర్గేను అవమానించాయని కాంగ్రెస్ ఎంపీ పవన్ ఖేరా అన్నారు. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ సమావేశం తర్వాత బీజేపీ, ఆర్ఎస్ఎస్ శుద్ధీకరణ పూజ చేయడం అవమానం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఖర్గేను లక్ష్యంగా చేసుకొని మోదీ, అమిత్ షా ఎన్నోసార్లు దుర్భాషలాడారని ఆయన ఆరోపించారు. రాజకీయ విమర్శలు, వ్యా్ఖ్యలను సెలెక్టివ్‌గా తీసుకోరాదని మరో కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మనూ సింఘ్వీ అన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత దూషణలు చేయడాన్ని సాధారణ విషయంగా చేసిన వారు ఇప్పుడు ఆగ్రహించాల్సిన అవసరం లేదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గచ్చిబౌలిలో 3.5 ఎకరాల్లో లెదర్ కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
నా చిన్నతనంలో అన్యాయాలను చూడలేకే నక్సలైట్ అయ్యా: మంత్రి సీతక్క
ఆ పరీక్షను వాయిదా వేయాలి.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు లేఖ