Share News

ఐదేళ్ల గరిష్ఠ స్థాయిలో నోట్ల చలామణి

ABN , Publish Date - Oct 26 , 2026 | 04:23 AM

ద్ద నోట్ల చలామణిని రద్దు చేసినా.. దేశంలో కరెన్సీ నోట్ల చలామణి ఏ మాత్రం తగ్గడం లేదు. ఏటేటా ఇది పెరిగిపోతూనే ఉంది. ఈ నెల 15వ తేదీ నాటికి దేశంలో...

ఐదేళ్ల గరిష్ఠ స్థాయిలో నోట్ల చలామణి

అక్టోబరు 15 నాటికి రూ.43.46 లక్షల కోట్లు : ఆర్‌బీఐ

ముంబై: పెద్ద నోట్ల చలామణిని రద్దు చేసినా.. దేశంలో కరెన్సీ నోట్ల చలామణి ఏ మాత్రం తగ్గడం లేదు. ఏటేటా ఇది పెరిగిపోతూనే ఉంది. ఈ నెల 15వ తేదీ నాటికి దేశంలో రూ.43.46 లక్షల కోట్ల విలువైన కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 13.5 శాతం ఎక్కువ. చలామణిలో ఉన్న కరెన్సీ (సీఐసీ) గత ఐదేళ్లలో ఎన్నడూ ఇంత భారీ స్థాయిలో లేదని ‘స్టేట్‌ ఆఫ్‌ ది ఎకానమీ’ పేరుతో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) విడుదల చేసిన ఒక నివేదిక తెలిపింది. గత ఏడాది సెప్టెంబరు నెలాఖరుతో పోల్చినా.. ఈ నెల 15వ తేదీ నాటికి చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లు 13.3 శాతం ఎక్కువ అని పేర్కొంది.

ఎఫ్‌సీఎన్‌ఆర్‌(బీ) డిపాజిట్ల బూస్ట్‌: ఆర్‌బీఐ వద్ద ఉండే రిజర్వ్‌ మనీ కూడా గత నెలాఖరు నాటికి భారీగా పెరిగింది. గత నెలాఖరు నాటికి ఇది రికార్డు స్థాయిలో రూ.53.24 లక్షల కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 10.3 శాతం ఎక్కువ. ప్రవాస భారతీయుల నుంచి ఇటీవల బ్యాంకులు సమీకరించిన ఎఫ్‌సీఎన్‌ఆర్‌(బీ) డిపాజిట్లు ఇందుకు ప్రధాన కారణం. ఈ ఏడాది జూన్‌ 8న ఆర్‌బీఐ ప్రకటించిన ఈ ప్రత్యేక డిపాజిట్‌ పథకం ద్వారా బ్యాంకులు 13,300 కోట్ల డాలర్ల (సుమారు రూ.12.56 లక్షల కోట్లు) వరకు సమీకరించాయి. పెద్దమొత్తంలో నోట్ల ముద్రణ కూడా దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లు పెరిగేందుకు మరో ప్రధాన కారణమని ఆర్‌బీఐ తెలిపింది.

లిక్విడిటీ తిప్పలు

ఎఫ్‌సీఎన్‌ఆర్‌(బీ) డిపాజిట్లతో బ్యాంకింగ్‌ రంగంలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) ఒక్కసారిగా రూ.12.5 లక్షల కోట్లకు పెరిగింది. దాంతో ఈ నిధులను ఎలా వినియోగించాలో తెలియక బ్యాంకులు తలలు పట్టుకున్నాయి. దీంతో ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా ఆర్‌బీఐ దాదాపు రూ.8.8 లక్షల కోట్ల నగదును వెనక్కి తీసుకుంది. ప్రస్తుత పండగల సీజన్‌ కొనుగోళ్లతో చలామణిలో ఉన్న నగదు (సీఐసీ) మరింత తగ్గుతుందని భావిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

పెట్టుబడులకు రెట్టింపు లాభాలు

మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

మీ-సేవలోడ్రైవింగ్‌ లైసెన్సు వీడియో!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 26 , 2026 | 04:23 AM