Share News

ఖర్గే వ్యాఖ్యల దుమారం.. దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల నిరసనలు

ABN , Publish Date - Oct 26 , 2026 | 03:46 PM

నిన్న (ఆదివారం) బిహార్‌లోని పట్నాలో ఓ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ‘మోదీ కాదు.. ఆయన బాబైనా పోవాల్సిందే’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో కాషాయ పార్టీ నాయకులు కాంగ్రెస్ అధ్యక్షుడిపై భగ్గుమన్నారు.

ఖర్గే వ్యాఖ్యల దుమారం.. దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల నిరసనలు

ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని మోదీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీజేపీ శ్రేణులు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. ఖర్గే తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంటూ కమలనాథులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. నిన్న (ఆదివారం) బిహార్‌లోని పట్నాలో ఓ కార్యక్రమానికి హాజరైన మల్లికార్జున ఖర్గే.. ‘మోదీ కాదు.. ఆయన బాబైనా పోవాల్సిందే’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో కాషాయ పార్టీ నాయకులు కాంగ్రెస్ అధ్యక్షుడిపై భగ్గుమన్నారు.


ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ ప్రధాన కార్యాలయాల్లో ఆ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఖర్గే దిష్టిబొమ్మలను దహనం చేశారు. అలాగే ఆయన పోస్టర్లకు నిప్పంటించి, వ్యతిరేక నినాదాలు చేశారు. బిహార్‌లో కమలనాథులు ఆందోళనలు నిర్వహించి, కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి ఖర్గే బహిరంగ క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు.


ఈ వివాదంపై బీజేపీ అగ్ర నాయకులూ స్పందించారు. ఖగ్గేను కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా విమర్శించారు. ‘ఇది చాలా బాధాకరం. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే.. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్‌లో చిన్న స్థాయి వ్యక్తి చేయలేదు. ఏకంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చేశారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.


Untitled-1 copy.jpgఖర్గే దిష్టిబొమ్మకు నిప్పంటిస్తున్న దృశ్యం.


ఈ వార్తలూ చదవండి

మోదీ బాబైనా పోవాల్సిందే.. ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు

మీవే ద్వంద్వ ప్రమాణాలు.. బీజేపీపై కాంగ్రెస్ మండిపాటు

Updated Date - Oct 26 , 2026 | 03:57 PM