మోదీ బాబైనా పోవాల్సిందే!
ABN , Publish Date - Oct 26 , 2026 | 05:06 AM
ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చేసిన ఓ వ్యాఖ్య వివాదాస్పదమైంది.
సర్ ప్రక్రియలో అక్రమాలపై ఖర్గే వ్యాఖ్య.. షా ఆగ్రహం
ఆయన క్షమాపణ చెప్పాలి: బీజేపీ నేతలు
మోదీ బాబైనా పోవాల్సిందే!
బిహార్‌లో ఖర్గే తీవ్ర వ్యాఖ్య.. అమిత్‌షా ఆగ్రహం
పట్నా/న్యూఢిల్లీ, అక్టోబరు 25: ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చేసిన ఓ వ్యాఖ్య వివాదాస్పదమైంది. పట్నాలో ఆదివారం బిహార్ తొలి సీఎం కృష్ణ సింగ్ 139వ జయంతి కార్యక్రమంలో ఖర్గే మాట్లాడారు. ‘సర్’ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడినవారందరినీ కాంగ్రెస్ జైలుకు పంపిస్తుందన్నారు. గత రెండేళ్లుగా జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికలను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. దీనిపై సభకు హాజరైన సంతోష్‌కుమార్ అనే వ్యక్తి స్పందిస్తూ.. ‘తిరుగుబాటు రాకపోతే మోదీ ఎక్కడకూ పోరు’ అని గట్టిగా అరిచాడు. వెంటనే ఖర్గే తిప్పికొడుతూ.. ‘‘మోదీ బాబైనా పోవాల్సిందే’’ అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు వెంటనే సంతో్‌షను అక్కడి నుంచి పంపేశారు. ఖర్గే వ్యాఖ్యపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బిహార్ సీఎం సామ్రాట్ చౌధరి, ఇతర బీజేపీ నేతలు మండిపడ్డారు. ఆయన అన్ని పరిధులూ దాటేశారని షా అన్నారు. 2014 నుంచి వరుస ఓటములతో కాంగ్రెస్ నిరాశానిస్పృహల్లో ఉందని.. అందువల్లే ఇలాంటి మాటలు వస్తున్నాయని ధ్వజమెత్తారు. ‘మోదీ, ఆయన కుటుంబంపై అసభ్య పదజాలం ఉపయోగించడం కాంగ్రెస్‌కు ఇదే తొలిసారి కాదు. ఆయన తల్లి గురించి కూడా అసభ్యంగా మాట్లాడారు. మోదీని చాయ్‌వాలా అని ఎద్దేవాచేశారు. ప్రజలే ఆ పార్టీకి బుద్ధిచెబుతారు’ అని ‘ఎక్స్’లో స్పష్టం చేశారు. ఖర్గే వ్యాఖ్యలు అనాగరికంగా ఉన్నాయని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ మండిపడ్డారు. కాగా, ఖర్గే వ్యాఖ్యలపై సోమవారం దేశవ్యాప్త నిరసనలకు బీజేపీ పిలుపునిచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యలు.. ఎన్డీయే నేతల తీవ్ర ఆగ్రహం
యూపీలో దారుణం.. మరిది ప్రైవేట్ పార్ట్స్‌ను కొరికేసిన వదిన