Share News

ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యలు.. ఎన్డీయే నేతల తీవ్ర ఆగ్రహం

ABN , Publish Date - Oct 25 , 2026 | 09:57 PM

పట్నాలో జరిగిన శ్రీకృష్ణ సింగ్ జయంతి సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ, ఎన్డీయే నేతలు తీవ్రంగా స్పందించారు.

ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యలు..  ఎన్డీయే నేతల తీవ్ర ఆగ్రహం
Mallikarjun Kharge Modi Remarks

ఆంధ్రజ్యోతి, అక్టోబర్ 25: బిహార్ రాజధాని పట్నాలో జరిగిన బిహార్ తొలి ముఖ్యమంత్రి శ్రీకృష్ణ సింగ్ జయంతి సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారం రేపాయి. సభలో ఖర్గే ప్రసంగిస్తూ 'సర్‌' ప్రక్రియ అక్రమాలపై మాట్లాడుతుండగా, సభలో ఉన్న ఒక వ్యక్తి 'తిరుగుబాటు జరిగే వరకు మోదీ పదవి నుంచి దిగిపోరు' అని అరిచారు. దానికి స్పందిస్తూ ఖర్గే.. 'మోదీ నాన్న కూడా వెళ్లాల్సిందే' అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఎన్డీయే నేతలు మండిపడ్డారు.

బీజేపీ, ఎన్డీయే నేతల రియాక్షన్స్:

అమిత్ షా (కేంద్ర హోం మంత్రి): ఖర్గే మర్యాదకు సంబంధించిన అన్ని హద్దులనూ దాటేశారని, రాజకీయాల్లో ఇటువంటి భాష తగదని విమర్శించారు.

నితిన్ నబీన్ (బీజేపీ అధ్యక్షుడు): కాంగ్రెస్ పార్టీ ఒక మాఫియా ముఠాలా ప్రవర్తిస్తోందని, ఖర్గే అల్లరి మూకల భాషను మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

శివరాజ్ సింగ్ చౌహాన్ (కేంద్ర మంత్రి): వరుస ఓటములతో కుంగిపోయిన కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడుతున్నారో కూడా మరచిపోతున్నారని వ్యాఖ్యానించారు.

సంజయ్ సరావోగి (బీజేపీ బిహార్ అధ్యక్షుడు): రాహుల్ గాంధీ, సోనియా గాంధీ రాసిచ్చిన స్క్రిప్ట్‌నే ఖర్గే చదువుతున్నారని ఆరోపించారు. (Mallikarjun Kharge Modi Remarks)


ఈ వార్తలు కూడా చదవండి..

గచ్చిబౌలిలో 3.5 ఎకరాల్లో లెదర్ కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు

నా చిన్నతనంలో అన్యాయాలను చూడలేకే నక్సలైట్ అయ్యా: మంత్రి సీతక్క

ఆ పరీక్షను వాయిదా వేయాలి.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు లేఖ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 25 , 2026 | 09:57 PM