Share News

మ్యాచ్‌కు ముందురోజు రాత్రి జ్వరం.. పెయిన్‌కిల్లర్స్ వేసుకుని బరిలోకి: హర్మన్‌ప్రీత్

ABN , Publish Date - Oct 26 , 2026 | 10:13 AM

జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో హర్మన్ ప్రీత్ కౌర్(126) సెంచరీతో చెలరేగింది. అయితే తన శతకం వెనుక ఉన్న కష్టాన్ని తాజాగా హర్మన్ వెల్లడించింది. మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి జ్వరంతో ఇబ్బంది పడ్డానని, పెయిన్‌కిల్లర్స్ మాత్రలు వేసుకుని బరిలోకి దిగానని తెలిపింది.

మ్యాచ్‌కు ముందురోజు రాత్రి జ్వరం.. పెయిన్‌కిల్లర్స్ వేసుకుని బరిలోకి: హర్మన్‌ప్రీత్
Harmanpreet Kaur

ఇంటర్నెట్ డెస్క్: జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో భారత మహిళా జట్టు అద్భుత విజయం సాధించింది. హర్మన్ ప్రీత్ కౌర్(126), దీప్తి శర్మ(106) సెంచరీలతో చెలరేగారు. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్.. సిరీస్ కైవసం చేసుకుంది. అయితే తన శతకం వెనుక ఉన్న కష్టాన్ని తాజాగా హర్మన్ వెల్లడించింది. మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి జ్వరంతో ఇబ్బంది పడ్డానని, పెయిన్‌కిల్లర్స్ మాత్రలు వేసుకుని బరిలోకి దిగానని తెలిపింది.


‘జింబాబ్వేతో రెండో వన్డేకు ముందు రోజు రాత్రి జ్వరంతో ఇబ్బంది పడ్డా. మ్యాచ్ ఆడేందుకు కూడా ఓపిక లేదు. విశ్రాంతి తీసుకుందామని అనుకున్నా. కానీ పెయిన్‌కిల్లర్స్ మాత్రలు వేసుకున్న తర్వాత కాస్త ఉపశమనం కలిగినట్లు అనిపించింది. ఆడాలని నిర్ణయించుకున్నా. బరిలోకి దిగి సెంచరీ చేశా. ప్రస్తుతం కెప్టెన్సీ భారం లేకుండా బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తున్నా. బ్యాటింగ్‌ చేసేటప్పుడు బ్యాటర్‌గానే ఆలోచించాలి. జట్టుకు అవసరమైనప్పుడు బాధ్యత తీసుకోవాలి. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాలి. జట్టు విజయమే నా అంతిమ లక్ష్యం’ అని హర్మన్ వెల్లడించింది.


మ్యాచ్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్‌ను.. ప్రతీకా రావల్, హర్మన్ ప్రీత్ కౌర్ గాడిలో పెట్టారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 124 పరుగులు జోడించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ కూడా అదరగొట్టింది. హర్మన్, దీప్తి కలిసి ఐదో వికెట్‌కు 153 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.


ఇవి కూడా చదవండి:

పీఆర్ టీమ్‌తో ప్రచారాలు చేసుకోరు.. ఆ భారత ప్లేయర్లతో బవుమాను పోల్చిన గావస్కర్

రోజుకు గంట మీ కోసం కేటాయించుకోండి.. జెన్ జీకి ధోని సూచన

Updated Date - Oct 26 , 2026 | 10:13 AM