Share News

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్: నెట్స్‌లో చెమటోడుస్తున్న కోహ్లీ.. వీడియో వైరల్

ABN , Publish Date - Oct 26 , 2026 | 09:11 AM

వన్డే ప్రపంచ కప్ 2027 లక్ష్యంగా ఆడుతున్న కోహ్లీ.. కివీస్‌తో సిరీస్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. నెట్స్‌లో వైట్ బాల్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్: నెట్స్‌లో చెమటోడుస్తున్న కోహ్లీ.. వీడియో వైరల్
Virat Kohli

ఇంటర్నెట్ డెస్క్: భారత జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడేసింది. కాగా నవంబర్ 4 నుంచి ఐదు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి వన్డేల్లోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వన్డే ప్రపంచ కప్ 2027 లక్ష్యంగా ఆడుతున్న కోహ్లీ.. కివీస్‌తో సిరీస్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. నెట్స్‌లో వైట్ బాల్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


వచ్చే నెల 4 నుంచి భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ కోసం కోహ్లీ ఇంకా న్యూజిలాండ్‌కు బయలుదేరలేదు. అయితే అంతకుముందే ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాడు. వైట్‌బాల్‌తో షాట్లు ఆడుతూ, తన ఆటకు పదును పెడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన ఈ స్టార్‌ బ్యాటర్‌.. కివీస్‌తో సిరీస్‌లో ఎలా రాణిస్తాడనే ఆసక్తి నెలకొంది.


ప్రపంచకప్‌ జట్టులో చోటుపై చర్చ

న్యూజిలాండ్‌తో సిరీస్‌లో కోహ్లీ ప్రదర్శనపై అందరి దృష్టి ఉండనుంది. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో కోహ్లీ, రోహిత్‌ శర్మలకు భారత జట్టులో చోటు దక్కుతుందా? అనే చర్చ క్రికెట్‌ వర్గాల్లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కివీస్‌తో సిరీస్‌ వీరిద్దరికీ కీలకంగా మారనుంది. ఇటీవల న్యూజిలాండ్‌ సహాయ కోచ్‌ జేమ్స్‌ పామెంట్‌ ఈ అంశంపై స్పందించాడు. కోహ్లీ, రోహిత్‌ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్ల కెరీర్‌ చివరి దశకు చేరుకునే సమయంలో వారి భవిష్యత్తుపై చర్చ జరగడం సహజమని పామెంట్‌ అభిప్రాయపడ్డాడు. ఎప్పుడు ఆట నుంచి తప్పుకోవాలనే నిర్ణయం తీసుకునే హక్కు ఆ ఆటగాళ్లకే ఉందని పేర్కొన్నాడు.


ఇవి కూడా చదవండి:

పీఆర్ టీమ్‌తో ప్రచారాలు చేసుకోరు.. ఆ భారత ప్లేయర్లతో బవుమాను పోల్చిన గావస్కర్

రోజుకు గంట మీ కోసం కేటాయించుకోండి.. జెన్ జీకి ధోని సూచన

Updated Date - Oct 26 , 2026 | 09:11 AM