దీప్తిశర్మ అరుదైన రికార్డు.. తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెర
ABN , Publish Date - Oct 26 , 2026 | 02:53 PM
భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. వన్డే క్రికెట్‌లో రెండు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేయడంతో పాటు బౌలింగ్‌లో 150పైగా వికెట్లు తీసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా దీప్తి శర్మ రికార్డులకెక్కింది.
స్పోర్ట్స్ డెస్క్: భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. వన్డే క్రికెట్‌లో రెండు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేయడంతో పాటు బౌలింగ్‌లో 150పైగా వికెట్లు తీసిన మూడో క్రికెటర్‌గా, తొలి భారత మహిళా క్రికెటర్‌గా దీప్తి శర్మ రికార్డులకెక్కింది. జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో ఈ ఫీట్ సాధించింది. ఈ మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌తో పాటు దీప్తి శర్మ సెంచరీలతో రాణించడంతో.. భారత్ 121 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. వైష్ణవి శర్మ (4 వికెట్లు), దీప్తి శర్మ (3 వికెట్లు) నిప్పులు చెరిగే బౌలింగ్‌తో జింబాబ్వే పతనాన్ని శాసించారు.
వన్డేల్లో దీప్తి శర్మకు జింబాబ్వేపై చేసిన శతకం రెండోది. ఆమె 2017 మే 15న ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో 160 బంతుల్లో 188 పరుగులు చేసి వన్డేల్లో తొలి సెంచరీ సాధించింది. తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ తాజాగా వన్డేల్లో మరో శతకాన్ని అందుకుంది. దీప్తి శర్మ వన్డేల్లో ఇప్పటివరకు 168 వికెట్లు తీయడంతో పాటు రెండు సెంచరీలు సాధించింది. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (49 సెంచరీలు, 154 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. మాజీ క్రికెటర్ మనోజ్ ప్రభాకర్ 2 సెంచరీలు, 157 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. దీప్తి శర్మ మూడో స్థానంలో కొనసాగుతోంది.
మహిళల వన్డే క్రికెట్‌లో టీమిండియా తరఫున ఆరు లేదా ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ బాదిన తొలి క్రికెటర్‌గా దీప్తి చరిత్ర సృష్టించింది. 86 బంతుల్లో 106 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో మెరిసిన దీప్తి శర్మ.. రిచా ఘోష్ (94 పరుగులు) బ్రేక్ చేసింది. జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో 83 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న దీప్తి .. భారత మహిళా క్రికెటర్లలో వేగంగా సెంచరీ సాధించిన మూడో క్రికెటర్‌గా రికార్డులకెక్కింది. దీప్తి కంటే ముందు కెప్టెన్ స్మృతి మంధాన, మాజీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
కివీస్-ఎతో మ్యాచ్: 199 పరుగుల వద్ద ఔట్.. అంపైర్ నిర్ణయంపై పడిక్కల్ అసహనం!
కివీస్‌తో మూడో టీ20కి ఇషాన్ కిషన్ దూరం.. వైభవ్‌కు మరో ఛాన్స్ దక్కుతుందా?
మ్యాచ్‌కు ముందురోజు రాత్రి జ్వరం.. పెయిన్‌కిల్లర్స్ వేసుకుని బరిలోకి: హర్మన్‌ప్రీత్