Share News

ఫేవరెట్‌.. భారత్‌

ABN , Publish Date - Oct 27 , 2026 | 06:01 AM

టోర్నమెంట్‌లో ఐదుసార్లు చాంపియన్‌..పైగా ఇటీవలి ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలుపొందిన కిక్‌..వెరసి మంగళవారం ఇక్కడ ప్రారంభమయ్యే ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ...

ఫేవరెట్‌.. భారత్‌

నేటి నుంచి

హాకీ ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ

రా. 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో

తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో ఢీ

జలంధర్‌: టోర్నమెంట్‌లో ఐదుసార్లు చాంపియన్‌..పైగా ఇటీవలి ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలుపొందిన కిక్‌..వెరసి మంగళవారం ఇక్కడ ప్రారంభమయ్యే ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ (ఏసీటీ) హాకీ టోర్నీలో ఆతిథ్య భారత్‌ తిరుగులేని ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మొదటి రోజు జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో మనోళ్లు తలపడుతున్నారు. 17 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత పంజాబ్‌ ఓ అంతర్జాతీయ టోర్నమెంట్‌కు ఆతిథ్యమిస్తుండడం విశేషం. పైగా..ప్రస్తుత భారత జట్టులోని సగం మందికిపైగా ఆటగాళ్లు ఆ రాష్ట్రానికి చెందిన వారే కావడం గమనార్హం. మొత్తం ఆరు జట్లు..భారత్‌, బంగ్లాదేశ్‌, చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, మలేసియా ఆడుతున్న ఈ చాంపియన్స్‌ ట్రోఫీ సింగిల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ విధానంలో జరుగుతుంది. అంటే..ఒక్కో జట్టు మరో జట్టుతో ఒకసారి ఢీకొంటుంది. లీగ్‌ దశలో మొదటి నాలుగు స్థానాలలో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరతాయి. సెమీస్‌, ఫైనల్‌ వచ్చేనెల 4, 5 తేదీల్లో మొహాలీలో నిర్వహిస్తారు. ఇక..భారత్‌లో ఆడేందుకు పాకిస్థాన్‌ నిరాకరించడంతో ఆ జట్టు స్థానంలో బంగ్లాదేశ్‌కు అవకాశమిచ్చారు. తొలి రోజు ఇతర మ్యాచ్‌ల్లో..మలేసియా-చైనా (మ.1), జపాన్‌-దక్షిణ కొరియా (మ.3.15) అమీతుమీ తేల్చుకుంటాయి.

భారత్‌ షెడ్యూల్‌

అక్టోబరు 27: బంగ్లాదేశ్‌తో

అక్టోబరు 29: చైనాతో

అక్టోబరు 30: జపాన్‌తో

నవంబరు 1 : మలేసియాతో

నవంబరు 2 : ద.కొరియాతో

ఇవి కూడా చదవండి:

ప్రమాదకర పిచ్‌పై కోహ్లీ పట్టుదల గురించి డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు!

యువ ఆల్ రౌండర్ నమన్ ధీర్‌పై అజింక్య రహానే ప్రశంసలు..

Updated Date - Oct 27 , 2026 | 06:01 AM