వైభవ్ కాదు.. జట్టుకు ఇప్పుడు వరుణ్ చక్రవర్తి అవసరం: భారత మాజీ క్రికెటర్
ABN , Publish Date - Oct 27 , 2026 | 07:10 AM
కివీస్‌తో మూడో టీ20కి గాయంతో ఇషాన్ కిషన్ దూరం కావడంతో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం ఇవ్వాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ చేసిన సూచన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా 2-0తో ఆధిక్యంలో ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన భారత జట్టు.. మంగళవారం వెల్లింగ్టన్ వేదికగా జరిగే మూడో టీ20లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. అయితే గాయంతో ఇషాన్ కిషన్ దూరం కావడంతో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం ఇవ్వాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ చేసిన సూచన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
‘వైభవ్ సూర్యవంశీని నంబర్ 3లో ఆడించే బదులు వరుణ్ చక్రవర్తిని తుది జట్టులోకి తీసుకోవాలి. ఆఖరి వికెట్ వరకు బ్యాటర్లు బాగా ఆడుతున్నారు. అలాంటప్పుడు వరుణ్ వంటి బౌలర్‌కు అవకాశం ఎందుకు ఇవ్వకూడదు? వరుణ్ ఆడితే.. న్యూజిలాండ్ భారీ స్కోర్లు చేయకుండా నియంత్రించగలడు. వైభవ్ కోసం సీనియర్ బ్యాటర్ సంజు శాంసన్ తన ఓపెనింగ్ స్థానాన్ని వదులుకోవాల్సి రావడం అన్యాయం. వైభవ్ ఓపెనర్‌గా బాగా ఆడుతున్న మాట నిజమే. కానీ సంజు కూడా ఓపెనర్‌గా రాణిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున సంజు నంబర్ 3లో బాగా ఆడినప్పటికీ.. ఇప్పుడు అతడిని తన స్థానంలోనే కొనసాగించాలి. ఆటగాడి కంటే బ్యాటింగ్ స్థానం ముఖ్యం. సంజు స్థానాన్ని మార్చడానికి నేను ఎంతమాత్రం అంగీకరించను’ అని బద్రీనాథ్ వివరించాడు.
బౌలర్లకు సవాలు..
మరోవైపు మూడో టీ20కి ముందు టీమిండియాకు న్యూజిలాండ్ నుంచి మాత్రమే కాకుండా వాతావరణం నుంచి కూడా సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. మూడు వైపులా బహిరంగంగా ఉండే వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్ మైదానంలో బలమైన గాలులు వీచే పరిస్థితులు ఉంటాయి. ఇవి బౌలింగ్, ఫీల్డింగ్ వ్యూహాలపై ప్రభావం చూపవచ్చు. తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉంటాయనే విషయంపై భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్పష్టత ఇవ్వలేదు.
ఇవి కూడా చదవండి:
ప్రమాదకర పిచ్‌పై కోహ్లీ పట్టుదల గురించి డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
యువ ఆల్ రౌండర్ నమన్ ధీర్‌పై అజింక్య రహానే ప్రశంసలు..