Share News

‘సర్‌’లో సొంతూళ్లకే మొగ్గు

ABN , Publish Date - Aug 13 , 2026 | 12:37 PM

ప్రత్యేక ఓటరు సవరణ జాబితా(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో పట్టణాల్లో ఉంటున్న పల్లెవాసులు తమ ఓటు హక్కును పల్లెల్లో ఉంచుకోవడానికే ప్రాధాన్యతనిచ్చారు.

‘సర్‌’లో సొంతూళ్లకే మొగ్గు
Special Intensive Revision SIR

  • వరంగల్‌ తూర్పులో 30,411 ఓటర్ల పర్మినెంట్‌ షిఫ్ట్‌

వరంగల్‌: ప్రత్యేక ఓటరు సవరణ జాబితా(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో పట్టణాల్లో ఉంటున్న పల్లెవాసులు తమ ఓటు హక్కును పల్లెల్లో ఉంచుకోవడానికే ప్రాధాన్యతనిచ్చారు. ఈ నెల 10వతేదీతో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ముగిసిన సందర్భంగా ఎన్నికల సంఘం విడుదల చేసిన వివరాల్లో పట్టణాల్లోని అధిక ఓట్లు శాశ్వతంగా మార్చుకున్నట్లు వెల్లడైంది.

వరంగల్‌ తూర్పు, వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాలలో అధికంగా గ్రామీణ ప్రాంతా ల నుంచి పిల్లల చదువు, వ్యాపారం, ఉద్యోగం, ఉపాధి కోసం వచ్చిన వారు ఇంతకాలం తమ సొంత ఊళ్లలో, పట్టణ ప్రాంతంలో రెండు చోట్ల ఓట్లు వేసేవారు.


ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ఎస్‌ఐఆర్‌తో పట్టణాల్లో ఉంటున్న వారంతా తమ ఓటును తమ సొంత ఊళ్లలో ఉండేలా చూసుకున్నారు. ఎందుకంటే గ్రామా ల్లో ఓటు హక్కు ఉన్నట్లయితే తమకు రావా ల్సిన అన్ని రకాల ప్రభుత్వ పథకాలు, రైతు బంధు, ఉపాధి హామీ లాంటి అనేక పథకాలు వస్తాయని, లేదంటే అవన్నీ కోల్పోయే ప్రమాదముందని గ్రహించారు. పట్టణాల్లో ఉంటున్నా పల్లెల్లోనే ఓటు హక్కు ఉండేలా తమ ఓటును ఎస్‌ఐఆర్‌లో పర్మినెంట్‌ షిఫ్టింగ్‌ చేసుకున్నారు. దీంతో అటు పట్టణాల్లో ఇటు పల్లెల్లో వేసే డబుల్‌ ఓటింగ్‌కు అడ్డుకట్టపడిం ది. పర్మినెంట్‌ షిఫ్టింగ్‌లో వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి అత్యధిక ఓటర్లు ఉన్నారు.


hnk2.2.jpgఅందులో వరంగల్‌ తూర్పు నియోజకవర్గం లో మొత్తం 2,60,437 మంది ఓటర్లు ఉండగా అందులో 30,411 మంది పర్మినెంట్‌ షిఫ్టింగ్‌ చేసుకున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,76,272 ఉండగా, అందులో 18,307 మంది ఓటర్లు పర్మినెంట్‌గా తమ ఓటును షిప్టింగ్‌ చేసుకున్నారు. అదేవిధంగా నర్సంపేట నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,40,244 ఉండగా అందులో 7,857 మంది ఓటర్లు పర్మినెంట్‌ షిప్టింగ్‌ చేసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మరణంలోనూ వెలుగులు..

ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థికసాయం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 13 , 2026 | 12:38 PM