Share News

మరణంలోనూ వెలుగులు..

ABN , Publish Date - Aug 13 , 2026 | 12:03 PM

తాము మరణిస్తూ కూడా ఇతరు ల జీవితాల్లో వెలుగులు నింపాలన్న తాప త్రయం కొందరిలో కనిపిస్తుంది.

మరణంలోనూ వెలుగులు..
National Organ Donation Day

  • మరో జీవితానికి ఊపిరి

  • అవయవ దానంపై పెరుగుతున్న ఆసక్తి

  • నేడు జాతీయ అవయవదాన దినోత్సవం

వరంగల్‌ మెడికల్‌: తాము మరణిస్తూ కూడా ఇతరు ల జీవితాల్లో వెలుగులు నింపాలన్న తాప త్రయం కొందరిలో కనిపిస్తుంది. మరో జీవితానికి ద్వారం వేయాలన్న సంకల్పం తో ముందుకు సాగుతున్నారు. గతంలో కళ్లుదానం చేసే ప్రక్రియతో మొదలై శరీర దానం చేసే వరకు చేరుకుంది. ప్రమాదాల బారిన పడి బ్రెయిన్‌డెడ్‌ అయిన కేసుల్లో అవయవ దానం చేసి అవసరమున్నవారికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నారు. అన్నదా నం, రక్తదానం, తరహాలో అవయవదానం కూడా చేరుకోవాలనే సంకల్పంతో ప్రపంచ అవయవ దాన దినోత్సవ సందర్భంగా ఆంధ్రజ్యోతి కథనం.


నైపుణ్యం ఉన్నా అవయవాల కొరత

తెలంగాణలో వైద్య పరంగా నైపుణ్యం, వనరులు ఉన్నప్పటికీ అవయవాల సరఫరా లేకపోవడం దురదృష్టంగా వైద్యులు అభిప్రాయపడుతున్నారు. డిమాండ్‌కు, అ వయవాల సరఫరాకు భారీ వ్యత్యాసం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమష్టి కృషితోనే ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తే కొందరి ప్రాణాలను నిలబెట్టవచ్చు డని సూచిస్తున్నారు.


అత్యవసరం

మూత్రపిండాలవ్యాధి చివరిదశలో ఉన్న రోగులు, తీవ్ర కాలేయ వైఫల్యంతో బాధ పడుతున్న రోగులు, గుండె జబ్బులతో బాధపడుతున్న రోగులకు అవయవదానం మహా ప్రసాదంలా ఉంటుంది. వీరి ప్రాణా లను కాపాడేందుకు అవయవాలు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. అవయవాలు దొరకక ప్రతీరోజు తక్కువలో తక్కువ 15 మంది చనిపోతున్నట్లు గణాంతాల ద్వారా తెలుస్తుంది. అవయవాల కోసం ఎదురు చూసే జాబితాలో ప్రతీ 10నిమిషాలకు ఒకకొత్త పేరు వచ్చి చేరుతున్నట్లు వైద్యవ ర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. ఇలాంటి వారం దరి జీవితాలు కొన ఊపిరి కింద ఉన్నట్లే లెక్క. చివరిదశలో కిడ్నీ సమస్యలతో ఉన్న వారు ఐదు శాతం కన్నా తక్కువ మందికే ప్రాణాలు కాపాడగల కిడ్నీ మార్పిడి జరు గుతుందని వైద్య గణాంకాల ద్వారా తెలు స్తుంది. గుండె ఊపిరితిత్తుల రోగుల పరి స్థితి మరి విధారకంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.


hnk1.2.jpgఒక్క దాత... ఎనిమిది జీవితాలు..

అవయవ దానం మానవతకు అంతిమ ప్రతి చిహ్నంగా భావించవచ్చు. ఒక దాత దేహం నుంచి గుండె, ఊపిరితిత్తులు కాలే యం, కిడ్నీలు, ప్యాంక్రియాస్‌, కణజాలము వంటివి తీసు కుంటే 8మంది ప్రాణాలను కాపాడవచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు. ఎనిమిది మంది జీవితాల్లో వెలుగులు నింపడంకు మించిన వారసత్వం ఇంకా ఏమీ ఉండదని వైద్యులు సూచిస్తున్నారు.


కమ్యూనికేషన్‌ కీలకం

అవయవ దానం చేయడానికి యోగ్యత ఉన్నవ్యక్తి కుటుంబంతో కరుణామయమైన కమ్యూనికేషన్‌ నిలపడం చాలా కీలకం. సమాజంలో ఎవరన్నా తమ అవయవాల ను దానం చేయాలనిచెప్పి మృతి చెందినా కూడా సదరు వ్యక్తుల కుటుంబసభ్యులు అందుకు తిరస్కరిస్తున్నారు. చైతన్యాన్ని పెంచే ప్రచారాలు, విధానపరమైన మార్పు ల ద్వారా ఆయా కుటుంబాల వైఖరిలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. సమష్టి కార్యచరణతో అవయవ మార్పిడి పై సమాజంలో చైతన్యం తీసుకు రాగలి గితే సత్ఫలితాలను పొందవచ్చును.


ముచ్చర్ల కళ్లకు నిరంతర వెలుగే..

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండ లం ముచ్చర్ల గ్రామంలో అధిక శాతం మంది నేత్రదానం చేసి స్ఫూర్తి ప్రదాతలు గా నిలుస్తున్నారు. ఈగ్రామం నుంచి ఇప్ప టి వరకు 60కిపైగా మృతుల నుంచి నేత్రాలను సేకరించినట్టు తెలుస్తోంది. ముచ్చర్ల స్ఫూర్తిగా ప్రతీ గ్రామం చైతన్యవంతమైతే అవసరమున్న వారికి అవయవాల కొరత ఉండదని తెలుస్తోంది. దేహమేదేవాలయం అని నమ్మేవారుతమ మరణంతర్వాత దే హాన్ని దానం చేయడానికి ముందుకు రావ డం హర్షనీయం. ఎంతో విలువైన దేహాన్ని దహనం చేస్తే బూడిదవుతుంది.. పూడిస్తే మట్టిలో కలిసిపోతుంది.. మనిషి చనిపో యాక కూడా తన అవయ వాలు ఇతరుల కు ఉపయోగపడేవిధంగా చైతన్యవంత మైన సమాజం నిర్మించాల్సి ఉంది.


hnk1.3.jpgఅవయవదానం పై మౌనం వీడాలి..

ఆరోగ్య రంగంలో ప్రగతి సాధిస్తూ మాతా శిశు సంరక్షణ రేటు తగ్గించుకున్నాం. నైపుణ్యం ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆరోగ్య రక్షణ ప్రభుత్వ, పైవ్రేటురంగంలో ఎంతో పురోగతి సాధించింది. అయినప్పటికీ అవయవాల మార్పిడికి వచ్చేసరికి కాస్త వెనుకబడే ఉన్నట్టు స్పష్టం అవుతుంది. ఈ నిశ్శబ్ద వాతావరణం వేలాది మంది జీవితాలను బలి తీసుకుంటుంది. అవయవ మార్పిడికి అవకాశం లేక ప్రాణాలు కోల్పో వడం చాలా దురదృష్టకరం. ప్రాణాలను కాపాడగల అవయవాల కోసం ఎదురుచూసి ప్రతి ఏటా వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.


మూఢనమ్మకాలు వద్దు.. అవయవ దానం ముద్దు..

  • కోన్‌రెడ్డి మల్లారెడ్డి (తెలంగాణ నేత్ర, అవయవ, శరీర దాతల అసోసియేషన్‌ )

సమాజంలో ప్రతి ఒక్కరూ మూఢ నమ్మకాలను విడనాడి శరీర దానం అవయవ దానం నేత్రదానానికి ముందుకు రావా లి. ఇతర దేశాల్లో అవయవ దానం 50శాతానికి పైగా ఉంటు న్నప్పటికీ భారతదేశంలో ఒక్క శాతం కూడా చేరుకోవడం లేదు. భారతదేశంలో ఏటా ఐదు లక్షల మంది అవయవాలు దొరకక మ రణిస్తున్నారు. బ్రెయిన్‌ డెత్‌ అయితే కుటుంబసభ్యు లు దానగుణంతో అవయవ దానానికి ముందుకు రావాలి. సహజ మరణంలో మృతదేహాన్ని వైద్య కళాశాలకు అందిస్తే వైద్య విద్యార్థులకు ఎంతగానో ఉపకరిస్తుంది. సమాజంలో చైతన్యం తీసుకొచ్చేందు కు మేము శ్రమిస్తున్నాం. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించి పదవి విర మణ అనంతరం మిత్రులతో కలిసి ఈ సంస్థను స్థాపించాం. స్వచ్ఛందంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాం.


160 శరీర దానాలు పూర్తి చేశాం

  • శ్రవణ్‌ కుమార్‌ (సదశాయ ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు)

19 ఏళ్లలో 1,635 నేత్రదా నాలు, 160 శరీర దానాలను ఇప్పటికే పూర్తి చేశాం. 95 అవయవ దానాలతో పాటు 60 వేలకు మందికి పైగా వ్యక్తులతో దానాలకు పత్రం తీసుకున్నాం. కాళోజీ స్ఫూర్తితో ఏర్పాటు చేసిన తమ సంస్థ ఆధ్వర్యంలో 2025 సదస్సులను అవయవ చైతన్యం కలిగించేందుకు ఏర్పాటు చేశాం. నా తమ్ముడు అశోక్‌కుమార్‌ శరీరదానం 2026లో చేసి అప్పటి నుంచి 19 ఏళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ ఫౌండేషన్‌ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అన్నా రు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ ఉచిత వైద్య శిబిరాలను కూడా నిర్వహిస్తున్నాం.


ఈ వార్తలు కూడా చదవండి:

తెలంగాణలో కొత్తగా 460 పోలింగ్‌ కేంద్రాలు

ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థికసాయం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 13 , 2026 | 12:03 PM