Share News

శ్రావణం..శుభకరం

ABN , Publish Date - Aug 13 , 2026 | 11:19 AM

తెలుగులోని పన్నెండు మాసాలు ఎంతో విశిష్టమైనవి. అందులో శ్రావణం.. కార్తీక మాసాలు ప్రత్యేకించి మహిళలకు ఎంతో ప్రీతికరం.

శ్రావణం..శుభకరం
Shravanam 2026

  • అంతటా శ్రావణమాసం శోభ

  • కూకట్‌పల్లి ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు

  • నెల రోజులపాటు ఆధ్యాత్మిక వాతావరణం

కూకట్‌పల్లి(హైదరాబాద్): తెలుగులోని పన్నెండు మాసాలు ఎంతో విశిష్టమైనవి. అందులో శ్రావణం.. కార్తీక మాసాలు ప్రత్యేకించి మహిళలకు ఎంతో ప్రీతికరం. ఈ మాసాల్లో ధార్మిక, ఆధ్యాత్మిక శుభ కార్యాలతో ముడిపడి ఉంటుంది. శుభ ముహుర్తాలు ఉండటంతో వివాహాలు, గృహప్రవేశం, గృహనిర్మాణం, నామకరణంతో పాటు పలురకాల పూజలకు శ్రావణమాసంలో చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఆషాఢ మాసంలో ఎడబాటుకు గురైన దంపతులు కూడా శ్రావణమాసంలోనే కలుస్తారు. అమ్మవారి ఆలయాలు, శైవక్షేత్రాలు, వైష్టవ సాంప్రదాయ ఆలయాలు ప్రత్యేక అలంకరణతో ఆకర్షణీయంగా అలంకరిస్తారు.


zz.jpgశ్రావణ మాసంలో ఇంటింటా ఆధ్యాత్మిక శోభ

లక్ష్మీ దేవిని పూజించే శుభకరమైన శ్రావణమాసం గురువారం నుంచి ఆరంభంకానుంది. పూజలు, వ్రతాలతో మహిళలు పనులలో నిమగ్నమవుతారు. ఈ మాసంలో శివపార్వతులకు, శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చాంద్రమాస ప్రకారం.. శ్రావణ మాసం 5వ నెలగా పరిగణిస్తారు. పౌర్ణమి చంద్రుడు శ్రవణ నక్షత్రం సమీపంలో సంచరిస్తున్నందున శ్రావణ మాసం అనే పేరు వచ్చిందని పండితులు చెబుతున్నారు. శ్రవణ నక్షత్రం శ్రీ మహావిష్ణువు నక్షత్రం కావడంతో ఈ మాసంలో వైష్ణవ ఆలయాల్లో పూజలకు ప్రసిద్ధి ఈనెలలో వచ్చే మంగళ, శుక్ర, శనివారాలు అత్యంత పుణ్యప్రదమైనవిగా భావిస్తారు.


city4.2.jpgమంగళవారాల్లో గౌరిపూజలు, శుక్రవారం లక్ష్మీపూజలు, శనివారాల్లో విష్ణుపూజలు చేస్తారు. శుక్లపక్షంతో వచ్చే 15 రోజులు పరమపవిత్రమైనవిగా భావించే పలువురు భక్తులు ఒక్కోరోజు ఒక్కోదేవునికి పూజలు చేస్తారు. పౌడ్యమి రోజు బ్రహ్మదేవుడికి, విదియ విష్ణుమూర్తికి తదియ పార్వతిదేవి, చవితి వినాయకుడు, పంచమి శశి, షష్టి నాగదేవతలు, సప్తమి సూరుడు, అష్ణమి దుర్గాదేవి, నవమి మాతృదేవతలు, దశమి ధర్మరాజు, ఏకాదశి మహర్షులు, ద్వాదశి శ్రీమహావిష్ణువు, త్రయోదశి అనుగుండు, చతుర్దశి పరమశివుడు, పౌర్ణమి పితృదేవతలలకు పూజించాలి. ఇలా పూజించడం వల్ల పుణ్యం దక్కుతుందని, ఆయురారోగ్యాలు వృద్ధిచెందుతాయని పురాణాలు చెబుతున్నాయి.


city4.jpgవరలక్ష్మీ వ్రతం..

శ్రావణమాసంలో వచ్చే రెండవ శుక్రవారం మహిళలు వరలక్ష్మీ వ్రతాలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఇంట్లోనే తూర్పులేద ఉత్తరం వైపు అమ్మవారి చిత్రపటం లేదా అమ్మవారి రూపు ప్రత్యేకంగా అలంకరించి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. సాయంకాలం ఇంటికి వచ్చిన మహిళలకు వాయనాలు ఇచ్చి పుచ్చుకుంటారు. పలు ఆలయాల్లో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించేందుకు ఇప్పటికే ఆలయాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. కూకట్‌పల్లిలోని ప్రశాంత్‌నగర్‌ శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయంలో శ్రావణ మాసం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు పృథ్వికృష్ణ తెలిపారు.


సకల శుభాల మాసం

శ్రావణమాసం ఎంతో శుభకరం.. ఉపవాసవ్రతాలు నిర్వహిస్తారు. దేవతలను పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. మహిళలు నిత్యపూజలు చేయడం ఎంతో శ్రేయస్కరం. మంగళగౌరి, వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించాలి. శాఖాహారం భజించడం నియమాలు పాటించడం వల్ల ఇంటిల్లిపాది ఆయురారోగ్యాలతో ఉండవచ్చు. - పృథ్వికృష్ణ, అర్చకులు, శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయం


మంగళగౌరి వ్రతం

కొత్తగా పెళ్లయిన యువతులు శ్రావణమాసంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. పూజమందిరంలో తూర్పుముఖంగా మండపం ఏర్పాటుచేసి మంగళగౌరిని పూజిస్తారు.

గౌరివ్రతం: కొత్త దంపతులు ప్రతి సోమవారం రంగవళ్లులతో గౌరిదేవిని అలంకరిస్తారు. సౌభాగ్యం ప్రసాదించాలని అమ్మవారిని, ఐశ్వర్యం ఇవ్వాలని కోరిన కోర్కెలు నెరవేర్చాలని ఈశ్వరుడిని పూజిస్తారు.

ముత్తయిదువల పూజ: ప్రతి శుక్రవారం కాళ్లకు పసుపు పారాణి పూసి ముత్తయిదువలను పూజిస్తారు. గోధూళి వేళ ఆలయాల్లో మహాలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు.

మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు: ఈపూజను ప్రతి సోమవారం 11మంది రుత్వికులు ఒక్కొక్కరు 11 రుద్రాలు పఠిస్తూ స్వామివారిని పూజిస్తారు. శివ లింగానికి ఫల పంచామృత పాలభిషేకాలు నిర్వహిస్తారు


ఈ వార్తలు కూడా చదవండి:

తెలంగాణలో కొత్తగా 460 పోలింగ్‌ కేంద్రాలు

ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థికసాయం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 13 , 2026 | 12:19 PM