Share News

రాజమండ్రిలో భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్

ABN , Publish Date - Aug 13 , 2026 | 09:40 AM

రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో 25.970 కేజీల గంజాయి పట్టుబడింది. ఏజెన్సీ ప్రాంతం సీలేరు నుంచి విజయవాడ వెళ్తున్న కారులో గంజాయిని పోలీసులు గుర్తించారు.

రాజమండ్రిలో భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్
Rajahmundry ganja seizure

రాజమండ్రి, ఆగస్టు 13: రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో 25.970 కేజీల గంజాయి పట్టుబడింది. ఏజెన్సీ ప్రాంతం సీలేరు నుంచి విజయవాడ వెళ్తున్న కారులో గంజాయిని పోలీసులు గుర్తించారు. మూడు పాలిథిన్ సంచుల్లో 25.970 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.4.29 లక్షలు ఉంటుందని అంచనా. అలాగే, గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం సారిపల్లెకు చెందిన దులపల్లి సుజీవ్ కుమార్, మోదుగు నరేష్‌గా గుర్తించారు.


విచారణలో నిందితులు చెప్పిన సమాచారం మేరకు, విజయవాడలో గంజాయి తీసుకునే వ్యక్తి చినమ్సెట్టి రాజేష్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. గంజాయి సేకరించిన సీలేరు సమీపంలోని చింటు అనే వ్యక్తి పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి కారు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి..

నేటి నుంచి సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుపై రయ్‌.. రయ్‌

మంత్రి సంధ్యారాణి మాజీ పీఏ ఆత్మహత్యాయత్నం

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 13 , 2026 | 10:52 AM