మంత్రి సంధ్యారాణి మాజీ పీఏ ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Aug 13 , 2026 | 08:24 AM
మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాజీ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) బందాపు సతీశ్ బుధవారం ఆత్మహత్యాయత్నం చేశారు. సాలూరు సమీపంలోని ఓ తోటలో నిద్రమాత్రలు మింగి.. ఓ మెసేజ్ వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశారు.
జగన్ మీడియా ప్రతినిధుల వేధింపులే కారణమని మెసేజ్
సాలూరు: మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాజీ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) బందాపు సతీశ్ బుధవారం ఆత్మహత్యాయత్నం చేశారు. సాలూరు సమీపంలోని ఓ తోటలో నిద్రమాత్రలు మింగి.. ఓ మెసేజ్ వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా సతీశ్ ఆచూకీ గుర్తించి ఆయనను సాలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. కాగా.. ఆత్మహత్యాయత్నానికి సతీశ్ పేర్కొన్న కారణాలు కలకలం రేపాయి.
ఈ మేరకు ఆయన పోస్ట్ చేసిన వాట్సాప్ మెసేజ్ వెంటనే డిలీట్ అయింది. తన వీధికి చెందిన ఓ మహిళతో పాటు ఓ మాజీ ఎమ్మెల్యే, జగన్ చానల్, పత్రిక విలేకరుల వేధింపులు తాళలేకే ఆత్మహత్యాయత్నం చేసినట్టు ఆ మెసేజ్‌లో ఉంది. అయితే ఈ మెసేజ్ గురించి సతీశ్ నోరు విప్పడం లేదు. పోలీసులు కూడా ఈ వివరాలు బహిర్గతం చేయడంలేదు.