స్వాతంత్య్ర సమర యోధురాలు మేడమ్ బికాజీకి.. పవన్ ఘన నివాళి
ABN , Publish Date - Aug 13 , 2026 | 08:54 AM
భారతదేశ స్వాతంత్య్ర పోరాట సమరంలో నిర్భయ విప్లవకారిణిగా నిలిచిన మేడమ్ బికాజీ కామా వర్ధంతి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు.
అమరావతి, ఆగస్టు 13: భారతదేశ స్వాతంత్య్ర పోరాట సమరంలో నిర్భయ విప్లవకారిణిగా నిలిచిన మేడమ్ బికాజీ కామా వర్ధంతి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు. స్వదేశంలోనే కాకుండా సరిహద్దులు దాటించి, అంతర్జాతీయ వేదికలపై భారత స్వాతంత్య్ర కలను చాటిచెప్పిన గొప్ప దేశభక్తురాలు బికాజీ కామా అని ఆయన కొనియాడారు. బ్రిటిష్ వలసవాద పాలనలో మన దేశ గొంతుకను అణచివేస్తున్న తరుణంలో, ఆమె ప్రపంచం ముందు నిర్భయంగా నిలబడి భారతదేశపు స్వేచ్ఛ, గౌరవం, సార్వభౌమత్వం కోసం ధైర్యంగా గళమెత్తారని గుర్తుచేసుకున్నారు.
విదేశీ గడ్డపై తొలి భారత పతాకావిష్కరణ..
1907వ సంవత్సరంలో జర్మనీలోని స్టట్‌గార్ట్‌లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ సదస్సులో మేడమ్ బికాజీ కామా చారిత్రాత్మకంగా తొలి భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అణచివేతకు లొంగక, మౌనంగా ఉండటానికి నిరాకరించిన భారత జాతి ఆత్మగౌరవానికి ఆ పతాకావిష్కరణ ఒక శక్తివంతమైన చిహ్నంగా నిలిచిందని తెలిపారు. ఆమె చూపిన తెగువ, దార్శనికత.. నేటికీ మన దేశ ఐక్యతను, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ప్రతి తరానికీ నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటాయని వ్యాఖ్యానించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇరాన్ ముప్పు నుంచి తప్పించుకునేందుకు అలా చేశా: డొనాల్డ్ ట్రంప్