36 మంది వీబీజీరామ్‌జీ ఏపీవోలపై చర్యలు
ABN , Publish Date - Aug 13 , 2026 | 08:30 AM
వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అజీవిక మిషన్(గ్రామీణ్)(వీబీజీరామ్‌జీ) పథకం ద్వారా శ్రామికులకు పని కల్పించడంలో నిర్లక్ష్యం వహించిన 36 మంది ఏపీవోలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్‌ఆర్‌డీఎస్ మెంబర్ సెక్రటరీ ఆదేశించారు.
శ్రామికులకు పనిదినాలు కల్పించడంలో నిర్లక్ష్యమే కారణం
అమరావతి: వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అజీవిక మిషన్(గ్రామీణ్)(వీబీజీరామ్‌జీ) పథకం ద్వారా శ్రామికులకు పని కల్పించడంలో నిర్లక్ష్యం వహించిన 36 మంది ఏపీవోలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్‌ఆర్‌డీఎస్ మెంబర్ సెక్రటరీ ఆదేశించారు. అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, మార్కాపురం, నంద్యాల, ప్రకాశం, శ్రీసత్యసాయి, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం, వైఎ్‌సఆర్ కడప జిల్లాలకు చెందిన ఏపీవోలకు చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల డ్వామా పీడీలకు సూచించారు.
ఈ ఏడాది జూలై 1 నుంచి వీబీజీరామ్‌జీ పథకం అమల్లోకి వచ్చినప్పటికీ, శ్రామికులకు పనిదినాలు కల్పించడంలో ఆయా ఏపీవోలు పూర్తి నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన 36 మంది ఏపీవోలతో ఇటీవల గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనరేట్ అధికారులు సమావేశమై చర్చించారు. వారి వివరణ సహేతుకంగా లేకపోవడంతో చర్యలు తీసుకున్నారు.