Share News

ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థికసాయం

ABN , Publish Date - Aug 13 , 2026 | 06:57 AM

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వైద్య విద్యార్థిని ప్రియాంక కుటుంబానికి ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి జీఎస్ఎల్ వైద్య కళాశాల యాజమాన్యం రూ.20 లక్షల ఆర్థిక సాయం అందజేసింది.

ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థికసాయం
Priyanka

  • బాధితులకు అండగా నిలిచిన జీఎస్ఎల్ వైద్య కళాశాల యాజమాన్యం

  • ఫీజుల రీఫండ్‌కూ హామీ!

అయిజ: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వైద్య విద్యార్థిని ప్రియాంక కుటుంబానికి ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి జీఎస్ఎల్ వైద్య కళాశాల యాజమాన్యం రూ.20 లక్షల ఆర్థిక సాయం అందజేసింది. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఎక్ల్‌సపూర్ గ్రామంలోని బాధిత కుటుంబాన్ని కళాశాల యజమాని కుమారుడు తరుణ్‌, కోడలు సాధ్విక, కళాశాల ప్రిన్సిపాల్‌ సుభాషిణిలు బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కళాశాల తరఫున రూ.20 లక్షల చెక్కును ప్రియాంక తండ్రి వెంకటేశ్‌కు అందజేశారు.


ఇప్పటి వరకు ప్రియాంక కళాశాలకు చెల్లించిన ఫీజులను కూడా తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కాగా, అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వెంకటేశ్‌ను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడించారు. పార్టీపరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని, లీగల్‌సెల్‌ ద్వారా న్యాయసహాయం అందిస్తామని కేటీఆర్‌ భరోసానిచ్చారు.

Updated Date - Aug 13 , 2026 | 07:01 AM