విజయవాడలో వెయ్యి మంది విద్యార్థులతో తిరంగా ర్యాలీ..
ABN , Publish Date - Aug 13 , 2026 | 10:48 AM
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. దాదాపు వెయ్యి మంది విద్యార్థులతో సాగిన ఈ ర్యాలీలో కలెక్టర్ లక్ష్మీశా, సీపీ రాజశేఖర్ బాబు, మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర పాల్గొన్నారు.
విజయవాడ, ఆగస్టు 13: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. దాదాపు వెయ్యి మంది విద్యార్థులతో సాగిన ఈ ర్యాలీలో కలెక్టర్ లక్ష్మీశా, సీపీ రాజశేఖర్ బాబు, మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్’ కార్యక్రమంలో భాగంగా మెగా ర్యాలీ నిర్వహించామని తెలిపారు. అన్ని రంగాల ప్రజలను మమేకం చేస్తూ, రానున్న 21 సంవత్సరాల్లో ఊరు, రాష్ట్రం, దేశం ఎలా ఉండాలనే ఆలోచనతో ‘నేను నా లక్ష్యం’ కోసం పని చేస్తాను అనే సంకల్పంతో ముందుకు సాగాలన్నారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములై ‘పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్’ కార్యక్రమంలో పాల్గొనాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
దేశభక్తి పెంపొందేలా కార్యక్రమాలు: సీపీ రాజశేఖర్ బాబు
80 సంవత్సరాలుగా ఆగస్టు15న ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని సీపీ రాజశేఖర్ బాబు అన్నారు. ప్రజలందరినీ మమేకం చేసి, అందరిలో దేశభక్తిని పెంపొందించేలాగా పలు కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగానే తిరంగా ర్యాలీని నిర్వహించినట్లు తెలిపారు. 2047 లక్ష్యాలకు అనుగుణంగా అందరం ముందుకు కదలాల్సిన అవసరం ఉందన్నారు. దేశ పౌరులందరూ నడుంకట్టి, మంచి సమాజం కోసం పాటుపడాలని సీపీ రాజశేఖర్ బాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
మంత్రి సంధ్యారాణి మాజీ పీఏ ఆత్మహత్యాయత్నం
కారులో 25.970 కేజీల గంజాయి తరలింపు.. ఇద్దరి అరెస్ట్
Read Latest AP News And Telugu News