Share News

ఆగస్టు 15.. యూఎస్‌లో ‘ఇండియా డే’

ABN , Publish Date - Aug 13 , 2026 | 11:24 AM

భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికాలోని అనేక రాష్ట్రాలు ఇండియా డే వేడుకలకు సిద్ధమవుతున్నాయి. ఆగస్టు 15ను ఇండియా డేగా ప్రకటిస్తూ ఇటీవల పలు రాష్ట్రాలు అధికారిక ప్రకటన విడుదల చేశాయి.

ఆగస్టు 15.. యూఎస్‌లో ‘ఇండియా డే’
India Day in USA

ఇంటర్నెట్ డెస్క్: భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికాలోని అనేక రాష్ట్రాలు ఇండియా డే వేడుకలకు సిద్ధమవుతున్నాయి. ఆగస్టు 15ను ఇండియా డేగా ప్రకటిస్తూ ఇటీవల కాలంలో పలు రాష్ట్రాలు అధికారిక ప్రకటన విడుదల చేశాయి. తాజాగా డెలావేర్ రాష్ట్రం కూడా ‘ఇండియా డే’ను అధికారికంగా ప్రకటించింది. అంతకుముందు, న్యూయార్క్, న్యూజెర్సీ, మాసాచుసెట్స్ రాష్ట్రాల ప్రభుత్వాలు ఆగస్టు 15న ఇండియా డేను అధికారికంగా జరుపుకోవాలని నిర్ణయించాయి.


రాష్ట్రంలో భారతీయ సంతతి ప్రజల భాగస్వామ్యంతో డెలావేర్ తనకంటూ ప్రత్యేకతను సంతరించుకుందని రాష్ట్ర గవర్నర్ మ్యాథ్యూ మేయర్ తాజాగా తెలిపారు. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు అనుసరించే ప్రజలు రాష్ట్రాన్ని మరింత బలోపేతం చేశారని వ్యాఖ్యానించారు. భారత సంతతి వారు తమ నైపుణ్యాలు, నాయకత్వం, సేవాతత్పరతో రాష్ట్రాన్ని సుసంపన్నం చేశారని ప్రశంసించారు. భారత సంస్కృతి, స్వాతంత్ర పోరాట స్ఫూర్తి, రాష్ట్రాభివృద్ధిలో భారత సంతతి ప్రజలు పాత్రకు గుర్తింపుగా ‘ఇండియా డే’ను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అంతకుముందు రోజు న్యూజెర్సీ గవర్నర్ కూడా ఆగస్టు 15ను ‘ఇండియా ఇండిపెండెన్స్ డే’గా ప్రకటించారు.


మరోవైపు, అమెరికా వ్యాప్తంగా భారత సంతతి వారు పంద్రాగస్టు వేడుకలకు సిద్ధం అవుతున్నారు. ప్రతి ఏటా వాషింగ్టన్‌లోని భారత ఎంబసీ సహా ఇతర రాష్ట్రాల్లోని కాన్సులేట్లలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. అమెరికా వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ కార్యక్రమాల్లో భారత సంతతి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. అమెరికా ప్రముఖులు రాజకీయ నాయకులు ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. అంతేకాకుండా, న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ బిల్గిండ్ సహా ప్రముఖ కట్టడాలు ఆగస్టు 15న మువ్వన్నెల కాంతుల్లో మెరిసిపోతాయి.


ఈ వార్తలనూ చదవండి:

అమెరికా యుద్ధనౌక ‘అబ్రహం లింకన్‌’లో రక్తపాతం?

క్యాటరింగ్‌ ట్రక్కులో ట్రంప్‌!

Updated Date - Aug 13 , 2026 | 11:38 AM