అమెరికా యుద్ధనౌక ‘అబ్రహం లింకన్’లో రక్తపాతం?
ABN , Publish Date - Aug 13 , 2026 | 05:54 AM
అమెరికా యుద్ధనౌక ‘ యూఎ్‌సఎస్ అబ్రహం లింకన్’లో అంతర్గత ఉద్రిక్తతలు చెలరేగడంతో జరిగిన ఘర్షణలో ఏడుగురు యూస్ నేవీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ అధికారిక మీడియా...
ఏడుగురి మృతి.. ఇరాన్ మీడియా కథనం
నౌకాదళ సిబ్బంది మధ్య పరస్పరం దాడులు
సుదీర్ఘ విధి నిర్వహణ, ఒత్తిడే కారణం!
ఇరాన్, ఆగస్టు 12: అమెరికా యుద్ధనౌక ‘ యూఎ్‌సఎస్ అబ్రహం లింకన్’లో అంతర్గత ఉద్రిక్తతలు చెలరేగడంతో జరిగిన ఘర్షణలో ఏడుగురు యూస్ నేవీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ అధికారిక మీడియా సంస్థ తస్నిమ్ నివేదించింది. నౌక సుదీర్ఘ కాలంగా సముద్రంలోనే విధుల్లో ఉండటం వల్ల సైనికుల్లో పెల్లుబికిన అసంతృప్తి, తీవ్ర మానసిక ఒత్తిడే ఈ దాడులకు కారణమని పేర్కొంది. తస్నిమ్ కథనం ప్రకారం.. సైనికులు తిరిగి వచ్చే తేదీపై స్పష్టత లేకపోవడంతో వారి కుటుంబసభ్యులు అమెరికాలో నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో సిబ్బంది ఫిర్యాదులను పరిశీలించి, వారిని సముదాయించేందుకు యూఎస్ సెంట్రల్ కమాండ్ అధిపతి బ్రాడ్ కూపర్ నౌక వద్దకు చేరుకున్నారు. అక్కడి పరిస్థితులు దిగజారడంపై బ్రాడ్‌కూపర్‌ను సిబ్బంది నిలదీశారు. వివాదం కాస్త ముదిరి సిబ్బంది పరస్పరం కత్తులతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. సరైన ఆహారం అందకపోవడం, అరకప్పు అన్నం, రెండు ముక్కల మాంసంతో సరిపెట్టుకోవాల్సి రావడంపై వారు ఆక్రోశం వ్యక్తం చేశారు. రెండు వారాలుగా లాండ్రీ బంద్ కావడం.. స్నానపు గదుల్లో నాచు చేరుకుని ఫంగల్ ఇన్ఫెక్షన్లు వ్యాపిస్తున్నాయని ఆరోపించారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణే మరణాలకు కారణమని ఇరాన్ మీడియా పేర్కొంది. 5వేల మంది సిబ్బందితో 208 రోజులుగా హిందు మహా సముద్రంలో మోహరించిన ఈ నౌక.. ఇప్పటికే తన సాధారణ కాలపరిమితిని దాటి అత్యధిక రోజులు సముద్రంలో గడిపింది. జూలైలో ఒమన్ వద్ద చిన్న విరామం మినహా.. ఎలాంటి పోర్టు విశ్రాంతి లేకుండా సిబ్బంది సముద్రంలోనే గడిపారు.
ఇవి కూడా చదవండి...
రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్
చంద్రబాబు.. నిజమైన అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Read Latest AP News And Telugu News