Share News

రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్

ABN , Publish Date - Aug 12 , 2026 | 01:22 PM

ఏనుగుల సంరక్షణకు కట్టుబడి ఉన్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ఏనుగుల ఆవాసాలు, కారిడార్ల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్
Pawan Kalyan

అమరావతి, ఆగస్టు 12: ఏనుగుల సంరక్షణకు కట్టుబడి ఉన్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా పవన్ స్పందిస్తూ.. ఏనుగుల ఆవాసాలు, కారిడార్ల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఏనుగు కేవలం అడవిలో జీవి మాత్రమే కాదని, పర్యావరణ సమతులత్యకు ప్రతీక అన్నారు. భారతదేశ వారసత్వంలో ఏనుగులు అంతర్భాగమని పేర్కొన్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో కుంకీ ఏనుగులు, H.A.N.U.M.A.N. చొరవతో వన్యప్రాణుల రక్షణను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తామని పవన్ వెల్లడించారు. శిక్షణ పొందిన సిబ్బంది, రెస్క్యూ మౌలిక వసతులు, సాంకేతికతతో వేగవంతంగా స్పందించే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సురక్షిత సమాజాలు, రక్షిత అడవులు, ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యమని స్పష్టం చేశారు. ‘ఏనుగులను కాపాడాలి.. అడవులను రక్షించాలి.. భవిష్యత్తును భద్రపరచాలి’ అంటూ ఎక్స్‌లో పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

వేంకటేశ్వర స్వామిని అవమానించిన వారిపై క్రిమినల్ కేసులు: భానుప్రకాశ్ రెడ్డి

వైసీపీ హయాంలో గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాలు.. సిట్ ఏం తేల్చిందంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 12 , 2026 | 01:38 PM