వైసీపీ హయాంలో గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాలు.. సిట్ ఏం తేల్చిందంటే
ABN , Publish Date - Aug 12 , 2026 | 12:39 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న గ్రూప్-1 మూల్యాంకనం అక్రమాలపై హైకోర్టుకు సిట్ తుది నివేదికను సమర్పించింది. గ్రూప్-1 మూల్యాంకనంలో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు సిట్ నిర్ధారించింది.
అమరావతి, ఆగస్టు 12: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న గ్రూప్-1 మూల్యాంకనం అక్రమాలపై హైకోర్టుకు సిట్ తుది నివేదికను సమర్పించింది. గ్రూప్-1 మూల్యాంకనంలో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు సిట్ నిర్ధారించింది. ఒకే జవాబు పత్రాలను మూడుసార్లు మూల్యాంకనం చేశారని వెల్లడించింది. డిజిటల్, హైలాండ్, విజయవాడల్లో మూడు దశల్లో మూల్యాంకనం జరిగిందని పేర్కొంది. ఎంపికైన 165 మందిలో 160 మంది పత్రాల్లో మార్కులకు సంబంధించి మార్పులు చోటు చేసుకున్నట్లు తెలిపింది. అలాగే, ఎంపిక కాని 161 మందిలో 153 మంది పత్రాల్లోనూ, రిట్ పిటిషనర్లలో 405 మంది జవాబు పత్రాల్లో మార్పులు జరిగినట్లు నివేదికలో పేర్కొంది.
చీఫ్ ఎగ్జామినర్లు మార్కులను సవరించినట్లు ఫోరెన్సిక్ నివేదికలో బయటపడినట్లు సిట్ తెలిపింది. 61 స్లిప్పుల్లో వైట్ కరెక్షన్ ఫ్లూయిడ్ గుర్తించామని, హైలాండ్ రిసార్ట్‌లో 84 రోజుల పాటు జవాబు పత్రాలు ఉన్నట్లు నివేదికలో వెల్లడించింది. 452 మంది నిపుణుల ప్యానల్‌ను పక్కనపెట్టి 66 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లతో మూల్యాంకనం చేసినట్లు పేర్కొంది. మూడో మూల్యాంకనం కోసం కొత్త OMR బార్‌కోడ్ షీట్లను ముద్రించారని, మూడుసార్లు మూల్యాంకనం APPSC రూల్‌కు విరుద్ధమని సిట్ తేల్చింది. దాదాపు 173 మంది సాక్షుల వాంగ్మూలాలతో, 7 CFSL ల్యాబొరేటరీల ఫోరెన్సిక్ డేటా ఆధారంగా సిట్ నివేదికను తయారుచేసి కోర్టుకు అందజేసింది.
ఇవి కూడా చదవండి...
పుష్కర లిఫ్ట్ స్కీం పైప్‌లైన్ పనులపై సమీక్ష.. ఏజెన్సీ ప్రతినిధులపై మంత్రి నిమ్మల ఆగ్రహం
వేంకటేశ్వర స్వామిని అవమానించిన వారిపై క్రిమినల్ కేసులు: భానుప్రకాశ్ రెడ్డి
Read Latest AP News And Telugu News