చంద్రబాబు.. నిజమైన అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ABN , Publish Date - Aug 12 , 2026 | 03:05 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసల జల్లు కురిపించారు. చంద్రబాబు విజనరీ లీడర్ అని.. అభివృద్ధికి అసలైన చిరునామా అంటూ కొనియాడారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 12: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసల జల్లు కురిపించారు. చంద్రబాబు విజనరీ లీడర్ అని.. అభివృద్ధికి అసలైన చిరునామా అంటూ కొనియాడారు. ఏ పని చేపట్టినా అద్భుతంగా చేయడం ఆయన ప్రత్యేకత అని అన్నారు. నిరంతర శ్రమ, దార్శనికత కలిగిన చంద్రబాబు.. నిజమైన అభివృద్ధికి చిరునామా అని అభివర్ణించారు.
ఈరోజు(బుధవారం) రాష్ట్రపతి ద్రౌపది ముర్మును విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కుటుంబం కలిసింది. ఈ సందర్భంగా ప్రెసిడెంట్‌కు ‘అమరావతి’ కాఫీ టేబుల్ బుక్‌ను ఎంపీ అందజేశారు. పుస్తకంలోని ఫొటోలను ముర్ము ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగానే ఏపీ సీఎంపై ప్రశంసల జల్లు కురిపించారు. అంతేకాకుండా, ‘అప్పలనాయుడిని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్లే ఉంది’ అని రాష్ట్రపతి అన్నారు. పార్లమెంట్‌కు సైకిల్‌పై రావడం, 100 శాతం హాజరుపై ఎంపీని ద్రౌపది ముర్ము అభినందించారు.
ఇవి కూడా చదవండి...
వైసీపీ హయాంలో గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాలు.. సిట్ ఏం తేల్చిందంటే
రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్
Read Latest AP News And Telugu News