Share News

మేడ్చల్‌ కోల్డ్ రష్ లాజిస్టిక్స్ గోదాంలో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

ABN , Publish Date - Aug 12 , 2026 | 01:36 PM

మేడ్చల్ జిల్లా దేవరయాంజాల్‌లోని కోల్డ్ రష్ లాజిస్టిక్స్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.

మేడ్చల్‌ కోల్డ్ రష్ లాజిస్టిక్స్ గోదాంలో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
Medchal fire accident

మేడ్చల్, ఆగస్టు 12: దేవరయాంజాల్‌లో కోల్డ్ రష్ లాజిస్టిక్స్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. దాదాపు పది ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అంతకంతకూ పెద్ద ఎత్తున్న మంటలు చెలరేగడంతో.. వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.


అయితే అగ్నిప్రమాదంతో దట్టమైన పొగలు అలుముకోవడంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఘటనాస్థలానికి డీఆర్ఎఫ్, ఫైర్, పోలీస్ మున్సిపల్ సిబ్బంది భారీగా మోహరించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

విశాఖలో నీటి కొరతపై ముందస్తు చర్యలు: జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్

‘వందల కోట్ల విలువైన భూములు ఎలా దక్కించుకోవాలో నేర్పించండి’.. కేటీఆర్ సెటైరికల్ పోస్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 12 , 2026 | 04:50 PM