జయశంకర్ భూపాలపల్లిలో క్షుద్రపూజల కలకలం.. భయాందోళనలో ప్రజలు
ABN , Publish Date - Aug 13 , 2026 | 11:23 AM
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండలం కుదురుపల్లి వాగులో క్షుద్రపూజల కలకలం రేగింది. బుధవారం రాత్రి అమావాస్య కావడంతో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వాగులో క్షుద్రపూజలు చేశారు.
జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 13: జిల్లాలోని మహాదేవపూర్ మండలం కుదురుపల్లి వాగులో క్షుద్రపూజల కలకలం రేగింది. నిన్న(బుధవారం) రాత్రి అమావాస్య కావడంతో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వాగులో క్షుద్రపూజలు చేశారు. నల్లకోడి, నిమ్మకాయలు, కోడి గుడ్డు, పసుపు, కుంకుమతో క్షుద్రపూజలు చేశారు. ఈరోజు(గురువారం) ఉదయం వాగు వద్దకు వెళ్లిన కొందరు గ్రామస్థులు.. క్షుద్రపూజలు జరిగినట్లు గుర్తించారు. విషయం తెలిసిన గ్రామ ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు.
అదే విధంగా కాటారం మండలం మద్దులపల్లి గ్రామంలోనూ రోడ్డుపై ముగ్గు, నిమ్మకాయలు, కోడిగుడ్లతో కొందరు వ్యక్తులు క్షుద్రపూజలు చేశారు. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ పూజల వల్ల ఎవరికి ఎలాంటి హానీ జరుగనుందో, ఎవరు అనారోగ్యం బారిన పడతారో అని ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితి.
ఇవి కూడా చదవండి..
కారులో 25.970 కేజీల గంజాయి తరలింపు.. ఇద్దరి అరెస్ట్
రేవంత్.. నువ్వు ముఖ్యమంత్రివా లేక రియల్ ఎస్టేట్ ఏజెంటువా: హరీశ్ రావు
Read Latest Telangana News And Telugu News