హఫీజ్ సయీద్‌కు మద్దతు ప్రకటించి.. భారత్‌పై విషం కక్కిన పాక్ మాజీ మంత్రి
ABN , Publish Date - Aug 13 , 2026 | 11:41 AM
పంద్రాగస్టు వేడుకలను భారత్ మరికొన్ని రోజుల్లో జరుపుకోనుంది. అలాంటి వేళ.. భారత్‌కు వ్యతిరేకంగా పాక్ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే లష్కర్ ఎ తైబా చీఫ్‌కు ఆయన తన మద్దతు ప్రకటించారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 13: పంద్రాగస్టు వేడుకలను మరికొన్ని రోజుల్లో భారత్ జరుపుకోనుంది. అలాంటి వేళ.. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కర్ ఎ తైబా చీఫ్‌పై పాకిస్థాన్ మాజీ మంత్రి, అవామీ ముస్లిం లీగ్ నాయకుడు షేక్ రషీద్ అహ్మద్ ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లష్కర్ ఎ తైబా చీఫ్ హఫీజ్ సయీద్‌కు తాను సేవకుడిని ఆయన ప్రకటించారు. హఫీజ్ సయీద్ వెంట పాకిస్థాన్‌తోపాటు తాము ఉన్నామని ఈ సందర్భంగా ప్రకటించారు. పాకిస్థాన్ వైపు కనీసం కన్నెత్తి చూస్తే భారత్‌ను అల్లా నాశనం చేస్తారని హెచ్చరించారు. ఆ దేశంలో పక్షుల కిలకిలారావాలు వినపడవని అన్నారు. దేవాలయాల్లో గుడి గంటలు కూడా మోగవని తీవ్ర స్వరంతో పాక్ మాజీ మంత్రి పేర్కొన్నారు.
భారత్‌లో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఏం జరగదని ఆయన అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు తన ఫోన్‌లో హఫీజ్ సయీద్ ఫోన్ నెంబర్‌ను అధికారులు గుర్తించారని చెప్పారు. దీంతో ఆ దేశం నుంచి తనను బహిష్కరించారని ఈ సందర్భంగా పాక్ మాజీ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ గుర్తు చేసుకున్నారు.
బహిరంగ సభలో షేక్ రషీద్ చేసిన ఈ వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతోంది. లష్కర్ ఎ తైబా సీనియర్ కమాండర్, పాకిస్థాన్ మార్కజీ ముస్లిం లీగ్ అధ్యక్షుడు ఖాలీద్ మసూద్ సంధుతోపాటు ఆ సంస్థ కేంద్ర సలహా కమిటీ సభ్యుడు ఖారీ మొహమ్మద్ యాకూబ్ షేక్ సమక్షంలో పాక్ మాజీ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు షేక్ రషీద్ అహ్మద్ ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. 2020 నుంచి 2022 వరకు ఇమ్రాన్ క్యాబినెట్‌లో దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశారు. అవామీ ముస్లిం లీగ్‌ను షేక్ రషీద్ స్థాపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఢిల్లీ పేలుళ్ల వెనుక అల్‌ఖైదా కుట్ర.. యూఎన్ నివేదికలో కీలక విషయాలు
నీట్ పీజీ పరీక్ష కేంద్రాలపై గందరగోళం!
For National News And Telugu News