నీట్ పీజీ పరీక్ష కేంద్రాలపై గందరగోళం!
ABN , Publish Date - Aug 13 , 2026 | 06:35 AM
నీట్ పీజీ పరీక్ష కేంద్రాల కేటాయింపు అంశం విద్యార్థుల్లో గందరగోళం సృష్టించింది. దేశవ్యాప్తంగా నీట్ పీజీ పరీక్ష ఈ నెల 30న జరగనుండగా.. ఇందుకు సంబంధించి పరీక్ష కేంద్రాల వివరాలు...
న్యూఢిల్లీ, ఆగస్టు 12: నీట్ పీజీ పరీక్ష కేంద్రాల కేటాయింపు అంశం విద్యార్థుల్లో గందరగోళం సృష్టించింది. దేశవ్యాప్తంగా నీట్ పీజీ పరీక్ష ఈ నెల 30న జరగనుండగా.. ఇందుకు సంబంధించి పరీక్ష కేంద్రాల వివరాలు తెలపడంలో తప్పులు చోటుచేసుకున్నాయి. అభ్యర్థులకు పరీక్ష కేంద్రాన్ని ఒక నగరంలో కేటాయిస్తే.. మరో నగరంలో కేటాయించినట్లుగా వారి మొబైల్‌కు మెసేజ్‌లు వచ్చాయి. కొందరు అభ్యర్థులకు ఏకంగా వారి నివాస ప్రాంతం నుంచి 2వేల కిలోమీటర్ల దూరంలోని నగరంలో పరీక్ష కేంద్రం కేటాయించినట్లు మెసేజ్‌లు అందాయి. ఈ గందరగోళంపై జాతీయ మెడికల్ సైన్సెస్ పరీక్షల బోర్డు(ఎన్‌బీఈఎంఎ్‌స) స్పందించింది. సాంకేతిక తప్పిదాల వల్ల పరీక్ష కేంద్రాల వివరాలు మెసేజ్‌ల్లో పొరపాటుగా నమోదయ్యాయని తెలిపింది. వాస్తవ పరీక్ష కేంద్రం వివరాలు అభ్యర్థి పోర్టల్‌లో ఉన్నాయని, సరిచూసుకోవాలని పేర్కొంది. ఇదిలా ఉండగా.. నీట్ యూజీ పేపర్ లీకేజీ కేసుకు సంబంధించిన చార్జిషీట్, సాక్షుల పేర్లు బహిర్గతం కావడంపై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. సాక్షుల్లో కొందరు మైనర్లు ఉన్న విషయాన్ని గుర్తు చేసింది.
ఇవి కూడా చదవండి...
రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్
చంద్రబాబు.. నిజమైన అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Read Latest AP News And Telugu News