Share News

పొద్దున, రాత్రి కరెంటు కోతలు

ABN , Publish Date - Sep 09 , 2026 | 11:36 AM

వ్యవసాయ రంగానికి సరఫరా అయ్యే త్రీఫేజ్‌ విద్యుత్‌లో అధికారులు రెండు గంటల పాటు కోత విధిస్తున్నారు.

పొద్దున, రాత్రి కరెంటు కోతలు
Power cuts in Warangal

  • త్రీ ఫేజ్‌ రెండు గంటలు, టూ ఫేజ్‌ గంటన్నర నిలిపివేత

  • రైతులు, సామాన్య ప్రజల ఇబ్బందులు

భీమదేవరపల్లి(వరంగల్): వ్యవసాయ రంగానికి సరఫరా అయ్యే త్రీఫేజ్‌ విద్యుత్‌లో అధికారులు రెండు గంటల పాటు కోత విధిస్తున్నారు. గతంలో బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు 24 గంటల ఉచిత విద్యుత్‌ను అమలు చేశారు. అయితే రాత్రి వేళల్లో త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి పగటి పూట 12 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను అందించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటే వరకు ఉచిత విద్యుత్‌ను ఉదయం 5.30 గంటల నుంచి సాయత్రం 5.30 గంటల వరకు అందించింది.


hnk4.2.jpgఅయితే ఎల్‌నినో ప్రభావంతో ప్రాజెక్టుల్లో నీళ్లు లేక పోవడం, విద్యుత్‌ తయారీలో అంతరాయం ఏర్పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని రైతాంగానికి ఉదయం 5:30గంటల నుంచి ఇచ్చే విద్యుత్‌ సరఫరాను ఉదయం 7:30గంటల వరకు త్రీఫేజ్‌ నిలిపివేస్తున్నారు. ఉదయం 7:30గంటల నుంచి సాయంత్రం 5:30గంటల వరకు రైతాంగానికి త్రీఫేస్‌ కరెంటును అందిస్తున్నారు. అందులోను తరుచూ అంతరాయం ఏర్పడుతుంది.


అలాగే రాత్రి వేళల్లో టూఫేస్‌ సరఫరాలో సుమారు గంటన్నర వరకు విద్యుత్‌ సరఫరాలో కోత విధిస్తున్నారు. రాత్రి వేళల్లో భోజనం చేసే, పడుకునే సమయంలో టూఫేస్‌ సరఫరాను నిలిపివేస్తుండడంతో దోమలు కుడుతున్నాయి. దీంతో అటూ రైతులు, ఇటూ సామాన్య ప్రజలు విద్యుత్‌ సరఫరాలో కోతలు విధిస్తుండడంతో విలవిలలాడుతున్నారు. ఈ విషయంపై స్థానిక విద్యుత్‌ అధికారులను వివరణ కోరగా విద్యుత్‌ సరఫరాలో కోతలు అంతా హైదరాబాద్‌ నుంచి నడుస్తుందని, తమ చేతుల్లో ఏమీ లేదని స్పష్టం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఆయనొక అక్షరాగ్ని

‘ఇందిరమ్మ’ లాటరీలో ఇళ్లురాని వారికి ధరావతు వాపస్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 09 , 2026 | 11:36 AM