Share News

యుద్ధం కావాలా.. అయితే సరిహద్దుల్లోకి వెళ్లండి: బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి

ABN , Publish Date - Sep 09 , 2026 | 10:14 AM

కుప్పంలో వైసీపీ ఎమ్మెల్సీ భరత్ చేసిన వాఖ్యలపై టీటీడీ బోర్డ్ మెంబర్, బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి మండిపడ్డారు. పోలీసులు ఈ వాఖ్యలను సుమోటాగా తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

యుద్ధం కావాలా.. అయితే సరిహద్దుల్లోకి వెళ్లండి: బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి

తిరుపతి, సెప్టెంబరు 9: కుప్పంలో వైసీపీ ఎమ్మెల్సీ భరత్ చేసిన వాఖ్యలపై టీటీడీ బోర్డ్ మెంబర్, బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి మండిపడ్డారు. ‘చంపడానికైనా, చావడానికైనా సిద్ధం’ అంటూ వ్యాఖ్యానించడం భరత్ అరాచకత్వానికి పరాకాష్ఠగా ఆయన పేర్కొన్నారు.


భానుప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వైసీపీని 11 స్థానాలకే పరిమితం చేసినా.. వారికి ఇంకా బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. 2019-24 వరకూ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌ను 'రాక్షస ప్రదేశ్‌'గా మార్చారని ఆయన విమర్శించారు.


యుద్ధం చేయాలనుకునేవారు దేశ సరిహద్దుల్లోకి వెళ్లి యుద్దం చేయాలి కానీ ప్రజాజీవనం మధ్య హింసకు పాల్పడరాదని భానుప్రకాశ్ హితబోధ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ..హింసను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్సీ భరత్‌ మాటలను సుమోటాగా తీసుకుని పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.


కుప్పంలో వైసీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కుప్పం నియోజకవర్గంలో నిర్వహించిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ భరత్ మాట్లాడిన మాటలు తీవ్రదుమారం రేపుతున్నాయి. ఆయన సమావేశంలో ప్రసంగిస్తూ..‘ప్రత్యర్థులు రక్తపాతాన్ని కోరుకుంటున్నారు. మేం రక్తాభిషేకం చేసైనా సరే విజయం సాధిస్తాం.. చంపడానికైనా.. చావడానికైనా సిద్ధపడేవారికే టిక్కెట్ ఇస్తాం’ అని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ దూరం.. కారణమిదే!

ఎండైనా వానైనా.. హైదరాబాద్‌ హైరానా

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 09 , 2026 | 10:28 AM