గణపతి నవరాత్రులకు విద్యుత్‌శాఖ సన్నద్ధం
ABN , Publish Date - Sep 09 , 2026 | 11:03 AM
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో ఎలాంటి విద్యుత్ ప్రమాదాలకు తావులేకుండా ఎన్పీడీసీఎల్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.
నిమజ్జన మార్గాలు, మండపాల వద్ద జాగ్రత్త చర్యలు
విద్యుత్ వాడకంలో నిబంధనలు పాటించాలంటున్న అధికారులు
రాంనగర్(హనుమకొండ): గణపతి నవరాత్రి ఉత్సవాల్లో ఎలాంటి విద్యుత్ ప్రమాదాలకు తావులేకుండా ఎన్పీడీసీఎల్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ నెల 14 నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గణేశ్ మండపాల ఏర్పాటు, అలంకరణ, తర లింపు, నిమజ్జనం విషయంలో భక్తులు, మండపాల నిర్వాహకులు, విద్యుత్ సిబ్బంది సమన్వ యంతో పనిచేసే దిశగా ఎన్పీడీసీఎల్ అధికారు లు క్షేత్రస్ధాయిలో పర్యటిస్తూ సలహాలు, సూచ నలు చేస్తున్నారు. చిన్న నిర్లక్ష్యం ప్రమాదంగా మారే ఆవకాశం ఉన్నందున విద్యుత్ భద్రత విషయంలో అప్రమత్తతగా ఉండాలని పిలుపునిచ్చారు.
ప్రత్యేక సూచనలు
విగ్రహాల ఎత్తు, వాటి తరలింపునకు ఉప యోగించే ట్రక్కులు, క్రేన్ల ఎత్తును దృష్టిలో ఉంచుకొని నిమజ్జన మార్గాలను విద్యుత్ సిబ్బంది ముందుగానే క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. సంబంధిత మార్గంలోని విద్యుత్ లైన్, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర విద్యుత్ పరికరాలను క్షుణంగా తనిఖీ చేయాలి. ప్రమాదకరంగా లేదా తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ లైన్లను గురించి అవసరమైన సాంకేతిక చర్యలు చేప ట్టాలన్నారు. క్రేన్లు, భారీ వాహనాలు, ఎత్తైన విగ్రహాలు విద్యుత్ లైన్లకు తగలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
విద్యుత్ లైన్లకు దగ్గరగా గణేశ్ విగ్రహాలు, క్రేన్లు, మెటల్ ఫ్రేమ్‌లు లేదా ఇతర అలంకరణ సామగ్రిని తీసుకెళ్లడం ప్రమాదకరం. వాటిని విద్యుత్ లైన్లకు దూరం గా సురక్షిత ప్రాంతంలో ఉంచాలి. విద్యుత్ తీగ లను నేరుగా తాకకపోయినా దానికి అత్యంత దగ్గరగా వెళ్లడం వలన ప్రమాదం సంభవించే అవకాశం ఉంది కాబట్టి విద్యుత్‌లైన్లకు సురక్షిత దూరం పాటించడం తప్పనిసరి. ఎక్కడైనా తెగిపోయిన విద్యుత్ తీగను లూజ్ లైన్లు, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ సం్తభాలు లేదా ఇతర ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తే ప్రజలు వాటిని తాకకుండా వెంటనే 1912 ట్రోల్‌ఫ్రీ నెంబర్‌కి సంప్రదించాలి.
పాటించాల్సిన భద్రత చర్యలు
మండపాల నిర్వాహకులు విద్యుత్ కనెక్షన్ ను అధికారికంగా, ఎస్పీడీసీఎల్ నిబంధనల ప్రకారం పొందాలి. నాణ్యమైన, ఐఎస్‌ఐ మార్క్ కలిగిన వైర్లు, పరికరాలను మాత్రమే ఉపయోగించాలి. సరైన సామర్థ్యం కలిగిన ఎంసీబీలు, ఇతర రక్షణ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలి. జాయింట్లు, దెబ్బతిన్న వైర్లు, టేప్‌తో తాత్కాలి కంగా చేసిన కనెక్షన్లను ఉపయోగించరాదు. విద్యుత్ వైరింగ్‌ను నీరు, తేమకు దూరంగా ఉంచాలి. వర్షం వచ్చినప్పుడు తడిసిన వైర్లు, స్విచ్‌లు, విద్యుత్ పరికరాలను తాకరాదు. పిల్లలను విద్యుత్ స్తంభాలు, వైర్లు, ఇతర విద్యుత్ పరికరాలకు దూరంగా ఉంచాలి. మండపాల వద్ద ఏర్పాటు చేసే మెటల్ నిర్మా ణాలు విద్యుత్ లైన్లకు దగ్గరగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
కేబుల్ వైర్లపై ప్రత్యేక దృష్టి
టీవీ, ఇంటర్నెట్ తదితర కేబుల్‌వైర్లు విద్యుత్ స్తంభాలపై చిందరవందరగా లేదా తక్కువ ఎత్తులో వేలాడుతూ ఉండకుండా సంబంధిత కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్న్‌ట్ సర్వీస్ ప్రొవైడర్లతో సమన్వయం చేసుకొని అవసరమైన చర్యలు చేపట్టాలి. పండుగ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇటువంటి కేబుల్ వైర్లను ప్రత్యేకంగా తనిఖీ చేసి, ప్రమాదకర పరిస్థితులు ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి.
విద్యుత్ భద్రత బాధ్యత
హనుమకొండ ఎస్‌ఈ బి.సామ్యా నాయక్
ప్రజలు విద్యుత్ భద్రతా నియమాలను పాటిస్తూ ఎన్పీడీసీఎల్‌కు సహకరించాలి. గణపతి నవరాత్రల వేడుకలను భక్తి శ్రద్ధలతో, ఆనందంగా జరుపుకుంటూ ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు లేకుండా సురక్షితంగా నిర్వహించుకోవాలి. విద్యుత్ సమస్యలు ఉంటే టోల్‌ఫ్రీ నెంబర్ లేదా స్థానిక విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వాలి.
ఈ వార్తలు కూడా చదవండి:
‘ఇందిరమ్మ’ లాటరీలో ఇళ్లురాని వారికి ధరావతు వాపస్
Read Latest AP News And Telangana News And International News And Telugu News