వైసీపీ అరాచక పాలన అంతానికి నాంది పలికిన చారిత్రక సందర్భం: మంత్రి అనగాని
ABN , Publish Date - Sep 09 , 2026 | 10:13 AM
మూడేళ్ల క్రితం స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేయడం ఓ సైకో నిరంకుశత్వానికి ఇదొక నిదర్శనమని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
అమరావతి, సెప్టెంబర్ 09: గతంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేయడం ఓ సైకో నిరంకుశత్వానికి ఇదొక నిదర్శనమని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. బుధవారం రాజధాని అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నేటికీ సరిగ్గా మూడేళ్లు అని గుర్తు చేశారు. 45 ఏళ్ల నిలువెత్తు రాజకీయ నిజాయితీ నిర్బంధమైన రోజని ఆయన అభివర్ణించారు.
ఆ రోజు తెలుగు జాతి చరిత్రలో చీకటి దినమని మంత్రి అనగాని అన్నారు. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అరెస్ట్‌తో తెలుగు ప్రజానీకం గళమెత్తిన కాలమని పేర్కొన్నారు. అంతేకాదు వైసీపీ అరాచక పాలన అంతానికి నాంది పలికిన చారిత్రక సందర్భం కూడా ఇదని మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు.
జగన్ ప్రభుత్వ హయాంలో సిల్క్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో నాటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడును (2023, సెప్టెంబర్ 9వ తేదీ) నంద్యాలలో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడ కోర్టులో ఆయనను హాజరు పరిచారు. ఆయనకు 14 రోజులు పాటు కోర్టు రిమాండ్ విధించింది. ఆ తర్వాత ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
దాదాపు 53 రోజులకు ఆయనకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో చంద్రబాబు ఒక్క రూపాయి కూడా లబ్ధి పొందినట్లు ఆధారాలు లేవని దర్యాప్తు సంస్థలు కోర్టు సమర్పించిన నివేదికల్లో స్పష్టం చేశాయి. అయితే చంద్రబాబు అక్రమ అరెస్ట్ అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి కూటమిగా ఏర్పాటయ్యాయి. 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి 164 స్థానాలు దక్కాయి. దీంతో ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ ఎన్నికల్లో వైసీపీకి మాత్రం కేవలం11 సీట్లకు పరిమితమైంది.
ఈ వార్తలు కూడా చదవండి..
రైలు ప్రయాణమంటే ఇంత సాహసం చేయాలా?.. వీడియో వైరల్
కేసీఆర్ ఫాంహౌస్ వద్ద ‘శుద్ధి’పై అసెంబ్లీలో దుమారం.. బీఆర్ఎస్‌పై మంత్రి ఫైర్
For AP News And Telugu News