Share News

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ దీపావళి వేడుకలు

ABN , Publish Date - Nov 08 , 2026 | 02:58 PM

మంత్రి పొన్నం ప్రభాకర్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి నూతన గృహాల్లో దీపావళి పండుగను జరుపుకున్నారు. లబ్ధిదారులకు స్వీ్ట్లు పంచిపెట్టిన మంత్రి.. వారితో కలిసి బాణాసంచా పేల్చారు.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ దీపావళి వేడుకలు
ponnam prabhakar celebrates diwali in hanmakonda

హనుమకొండ, నవంబర్ 8: జిల్లాలోని పలు మండలాల్లో.. లబ్ధిదారులకు అందజేసిన ఇందిరమ్మ ఇళ్లలో నిర్వహించిన దీపావళి సంబరాలల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని కేక్ కట్ చేశారు.


హన్మకొండ జిల్లాలోని భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లోని ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ నూతన ఇళ్లల్లో దీపావళి పండుగ జరుపుకున్నారు. వారితో కలిసి బాణాసంచా పేల్చారు. అనంతరం లబ్ధిదారులకు స్వీట్లు పంచిపెట్టారు. ‘ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో దీపావళి సెలబ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. పేదల కళ్లల్లో ఆనందం చూసేందుకు మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. నా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో దీపావళి జరుపుకోవడం మరిచిపోలేని అనుభూతిని ఇచ్చింది’ అని మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సంక్రాంతి తర్వాత ప్రజాబలం పేరుతో అన్ని నియోజకవర్గాలు పర్యటిస్తా: సీఎం రేవంత్‌రెడ్డి

ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి

దీపావళి కానుకగా మరో 4.5 లక్షల మందికి చేయూత పింఛన్లు: మంత్రి సీతక్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 08 , 2026 | 02:58 PM