పేలుతున్న ఉల్లిగడ్డ ధరల బాంబు
ABN , Publish Date - Aug 27 , 2026 | 12:37 PM
తల్లి చేసే మేలు ఉల్లి చేస్తుందంటారు. రుచితో పాటు ఔషధగుణాలు కలిగిన ఉల్లిని ఎంతో ఇష్టంగా తింటారు. ప్రస్తుతం తెల్ల ఉల్లి కిలోకు రూ.100 చేరువ కాగా, ఎర్ర ఉల్లి రూ.60 నుంచి 70 వరకు ధర పలుకుతోంది.
రూ.100కు చేరువలో కిలో తెల్ల ఉల్లి
రూ.70 ధర పలుకుతున్న ఎర్ర ఉల్లి
భీమదేవరపల్లి(వరంగల్): తల్లి చేసే మేలు ఉల్లి చేస్తుందంటారు. రుచితో పాటు ఔషధగుణాలు కలిగిన ఉల్లిని ఎంతో ఇష్టంగా తింటారు. ప్రస్తుతం తెల్ల ఉల్లి కిలోకు రూ.100 చేరువ కాగా, ఎర్ర ఉల్లి రూ.60 నుంచి 70 వరకు ధర పలుకుతోంది. రెండు నెలల కిందట వాహనాల ద్వారా ఎర్ర ఉల్లిని రూ.100కు ఆరు కిలోల చొప్పున అందించేవారు. కిలోకు రూ.20 ఉన్న ఎర్ర ఉల్లి అమాంతం పెరిగి వినియోగదారుడిని బెంబేలెత్తిస్తోంది. ధరలు బాంబుల్లా పేలుతుండటంతో తెల్ల ఉల్లి ఆకాశాన్ని అంటుతోంది.
మాంసాహారం, శాకాహారం, చపాతీలు, మిర్చి బజ్జీలు, చిట్టి గ్యారెలు తదితర పదార్థాల్లో కమ్మగా నంజుకుతినే ఉల్లి... ధరాభారంతో ఆందోళన కలిగిస్తోంది. పెరిగిన ధరలు చూసి గృహిణులు సైతం దడుసుకుంటున్నారు. సామాన్య ప్రజలు ఉల్లిని కొనాలంటే ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా ఉల్లిని మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకుంటారు. కానీ అక్కడ వర్షాలు లేక పంటలు పండకపోవడంతో దిగుమతి తగ్గింది.. దీంతో ధర పెరిగింది.
ఈ వార్తలు కూడా చదవండి:
కాచిగూడ-అశోకాపురం ఎక్స్ప్రెస్ రైలు సమయంలో మార్పులేదు
Read Latest AP News And Telangana News And International News And Telugu News