మేడారంలో చిందేసిన న్యూజిలాండ్ కళాకారులు..
ABN , Publish Date - Jan 26 , 2026 | 09:04 PM
మేడారం మహాజాతర వేళ అద్భుతమైన సన్నివేశం ఆవిష్కృతమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారంలో సమ్మక్క- సారలమ్మ అమ్మవార్ల గద్దెల వద్ద న్యూజిలాండ్ కళాకారులు చేసిన సందడి చేశారు..
మేడారం, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): మేడారం మహాజాతర (Medaram Jathara) వేళ అద్భుతమైన సన్నివేశం ఆవిష్కృతమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారంలో సమ్మక్క- సారలమ్మ అమ్మవార్ల గద్దెల వద్ద న్యూజిలాండ్ కళాకారులు చేసిన సందడి చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మేడారంలో 'హకా' (Haka) నృత్యం
న్యూజిలాండ్‌కు చెందిన 'మావోరీ' (Maori) తెగ ప్రజలు ప్రదర్శించే సాంప్రదాయ యుద్ధ నృత్యమే ఈ 'హకా'. ఇది చాలా శక్తివంతమైనది. పాదాలను నేలకేసి కొడుతూ, గట్టిగా శబ్దం చేస్తూ, ముఖ కవళికల ద్వారా వీరత్వాన్ని ప్రదర్శించడం ఈ నృత్యం ప్రత్యేకత. ఒక గిరిజన సంస్కృతికి (తెలంగాణ) మరో అంతర్జాతీయ గిరిజన సంస్కృతి (న్యూజిలాండ్) వందనం సమర్పించినట్లుగా ఈ ప్రదర్శన సాగింది.
మంత్రి సీతక్క నృత్యం..
మేడారం జాతర పనుల పర్యవేక్షణలో ఉన్న మంత్రి సీతక్క.. విదేశీ కళాకారుల ఉత్సాహాన్ని చూసి స్వయంగా వారితో కలిశారు. వారి అడుగులకు అనుగుణంగా మంత్రి సీతక్క కూడా నృత్యం చేసి, విదేశీ పర్యాటకులకు సాదర స్వాగతం పలికారు. మేడారం జాతరకు న్యూజిలాండ్ కళాకారులు రావడంతో ఈ జాతర అంతర్జాతీయ గుర్తింపు పొందిందని భక్తులు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి, అంతర్జాతీయ కళలకు మేడారం ఒక వారధిగా నిలుస్తోందని తెలిపారు. విదేశీయులు సైతం అమ్మవార్లను దర్శించుకోవడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని భక్తులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మా అక్క మాట్లాడటం లేదు.. కానిస్టేబుల్ సౌమ్య సోదరుడి ఆవేదన
ఆర్టీసీ డ్రైవర్ నాగరాజుకు గుండెపోటు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Read Latest Telangana News And Telugu News