ఎయిర్‌పోర్ట్ నిర్మాణ టెండర్లకు కసరత్తు
ABN , Publish Date - May 20 , 2026 | 12:55 PM
రంగల్ సమీపంలోని మామునూరు ఎయిర్‌పోర్ట్ శంకుస్థాపనకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) బృందం వేగంగా కసరత్తు చేస్తోంది.
వచ్చే వారంలో పిలువనున్న ఏఏఐ
ఇప్పటికే పూర్తయిన రన్‌వే, సాయిల్, ఎన్విరాన్‌మెంట్ టెండర్లు
వరంగల్: వరంగల్ సమీపంలోని మామునూరు ఎయిర్‌పోర్ట్ శంకుస్థాపనకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) బృందం వేగంగా కసరత్తు చేస్తోంది. జూలైలో నిర్మాణ పనులు ప్రారంభించేలా అధికారులు కార్యాచరణ చేపట్టారు. అందుకోసం సాయిల్, రన్‌వే, టర్మినల్స్ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్, ఎన్విరాన్‌మెంట్ టెస్టింగ్ పనులకు ఈ నెల 8న టెండర్లు ఆహ్వానించగా మంగళవారం పూర్తయ్యాయని,
ఈ నెల 21న వాటిని ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. వారం రోజుల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు, టెక్నికల్ బిడ్స్, రన్‌వే ఆప్రాన్ ఇతర పనులకు టెండర్లను ఆహ్వానించేందుకు రూపకల్పన, డీపీఆర్‌ను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి:
సరస్వతి అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తి: కొండ సురేఖ
Read Latest AP News And Telangana News And International News And Telugu News