కులగణనపై సీజేఐ ధర్మాసనం కీలక తీర్పు
ABN , Publish Date - May 20 , 2026 | 11:40 AM
కులగణనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జనగణనలో కులాల లెక్కింపునకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అనుమతి ఇచ్చారు.
న్యూఢిల్లీ, మే 20: కులగణనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జనగణనలో కులాల లెక్కింపునకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం అనుమతి ఇచ్చింది. కులగణనను వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ధర్మాసనం కొట్టివేసింది. ఈ మేరకు బుధవారం జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించారు.
సంక్షేమ పథకాల అమలుకు కులగణన తప్పనిసరి అని స్పష్టం చేసింది. కుల గణన ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని పేర్కొంది. ఈ అంశంలో కోర్టుల జోక్యం ఉండదని స్పష్టం చేసింది. జన గణన.. కుల ప్రాతిపదికన జరగాలా వద్దా అనేది విధానపరమైన నిర్ణయమని పేర్కొంది. వెనుకబడిన తరగతికి చెందిన వారు ఎంతమంది ఉన్నారో ప్రభుత్వం తెలుసుకోవాల్సి ఉందని ఈ ధర్మాసనం వ్యాఖ్యానించింది.
జనగణన నుంచి కులగణనను మినహాయించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఈ సందర్భంగా ధర్మాసనం తిరస్కరించింది. ఈ అంశం ప్రభుత్వ విధాన పరిధిలోకి వస్తుందని వివరించింది. అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని తెలిపింది. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జయమల్యా బాగ్చీ, విపుల్ పంచోలీతో కూడిన ధర్మాసనం విచారించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సరస్వతి అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తి: కొండ సురేఖ
మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: డిప్యూటీ సీఎం
For More National News And Telugu News