Share News

అర్ధరాత్రి యువతి కిడ్నాప్.. కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు

ABN , Publish Date - May 20 , 2026 | 12:15 PM

అత్తాపూర్‌లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. యువతిని కిడ్నాప్ చేసిన వాహనాన్ని అత్తాపూర్ నుండి ఆరంఘర్ చౌరస్తా వరకు పోలీసులు చేజ్ చేశారు.

అర్ధరాత్రి యువతి కిడ్నాప్.. కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు

హైదరాబాద్, మే 20: అత్తాపూర్‌లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. యువతిని కిడ్నాప్ చేసిన వాహనాన్ని అత్తాపూర్ నుండి ఆరంఘర్ చౌరస్తా వరకు పోలీసులు చేజ్ చేశారు. పోలీసుల కళ్లు కప్పి కిడ్నాపర్స్ పారిపోయారు. ఆ కారుకు నెంబర్ ప్లేట్ లేక పోవడంతో వివరాలు సేకరించడంలో పోలీసులు విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే 143 పిల్లర్ నెంబర్ వద్ద సీసీ టీవీ కెమెరా ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలించారు.


కారుకు నెంబర్ ప్లేట్ లేకపోవడంతో.. వివరాలు సేకరణ కష్టంగా మారింది. మరో వైపు ఆ యువతి కిడ్నాప్‌నకు గురైందా? లేక వేరే కారణం ఏదైనా ఉందా? అనే కోణంలో అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు మూడు గంటల వరకు పోలీసులు దర్యాప్తు కొనసాగింది.

కిడ్నాప్‌నకు గురైన యువతి ఎవరన్నది ఇప్పటికే తెలియని పరిస్థితి నెలకొంది. యువతి కిడ్నాప్‌పై ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు అందలేదు. ఇక కిడ్నాప్‌నకు గురైన ప్రదేశంలో తమకు సమాచారం అందించిన ప్రత్యక్ష సాక్షులను ఈ సందర్భంగా పోలీసులు విచారిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సరస్వతి అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తి: కొండ సురేఖ

మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: డిప్యూటీ సీఎం

For More TG News And Telugu News

Updated Date - May 20 , 2026 | 12:57 PM