Share News

మండే ఎండ...మారిన పంథా

ABN , Publish Date - May 20 , 2026 | 10:31 AM

ఎండలు అదిరిపోతున్నాయి. ఒకప్పటి హైదరాబాద్‌ వాతావరణానికి, ఇప్పటికి అసలు సంబంధమే లేదు. ఉక్కబోత నిత్యకృత్యమైంది.

మండే ఎండ...మారిన పంథా
Summer, Online Shopping

  • నగరవాసుల జీవనశైలిలో మార్పులు

  • ఎక్కువగా ఇంటి నుంచే పనులు చక్కబెడుతున్న వైనం

  • చల్లటి దుస్తులు, ఆహార పదార్థాల వైపు మొగ్గు

  • తగ్గిన షాపింగ్‌.. పెరిగిన ఆన్‌లైన్‌ ఆర్డర్లు

హైదరాబాద్‌ సిటీ: ఎండలు అదిరిపోతున్నాయి. ఒకప్పటి హైదరాబాద్‌ వాతావరణానికి, ఇప్పటికి అసలు సంబంధమే లేదు. ఉక్కబోత నిత్యకృత్యమైంది. బయటకు వెళ్తే వడదెబ్బ కొడుతుందేమోనన్న భయం నగరవాసులను వెంటాడుతున్నాయి. ఈ ఎండల దెబ్బకు ఆలస్యంగా నిద్రలేవడం, అర్ధరాత్రుల వరకు విందు వినోదాలలో మునిగితేలడం వంటి సంప్రదాయం మారిపోయిందిప్పుడు. తినే ఆహారం మొదలు, వినోదం వరకు, పనిచేసే విధానం నుంచి యాత్రలకు వెళ్లే తీరు వరకు నగరవాసి జీవనశైలిలో వినూత్న ధోరణులు కనిపిస్తున్నాయి. అవసరమైతే తప్ప రోడ్డు మీద కనిపించడం లేదు. ఇప్పుడు అంతా ఇండోర్‌ వర్క్‌లకే మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా చల్లదనానికి ఓవర్‌ సైజ్డ్‌ కాటన్‌ వస్త్రాలకు జై కొడుతుంటే, ఆరోగ్య ‘మస్తు’ అంటూ ఇన్‌ఫ్యూజ్డ్‌ వాటర్‌ మాత్రమే తీసుకుంటున్నారు. నగరవాసుల మైక్రో వర్కేషన్స్‌ మొదలు షాపింగ్‌ ధోరణుల వరకు ఈ సీజన్‌లో మారిన జీవనశైలిని ఓసారి పరిశీలిస్తే..


city4.2.jpgనైట్‌ డైనింగ్‌

ఎండల కారణంగా పగటి పూట హోటల్‌కు వెళ్లడం మరీ ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి వెళ్లడం తగ్గిపోయింది. ఆదివారాలు కూడా రాత్రి పూట డైనింగ్‌ కనిపిస్తోంది.

ఫంక్షనల్‌ వాటర్‌

ఎండల నుంచి రక్షణకు ఎక్కువగా ఫంక్షనల్‌ వాటర్‌ తీసుకుంటున్నారు. నిమ్మకాయ, కీర, పుదీనా లాంటివి కలిపిన నీళ్లను తాగుతున్నారు.

కూల్‌ కూల్‌గా ఉండేలా..

శరీరానికి అంటుకోకుండా, వదులుగా ఉండే ఓవర్‌ సైజ్డ్‌ కాటన్‌, లినెన్‌ షర్టులు, కో ఆర్డ్‌ సెట్స్‌ వంటివి ప్రస్తుతానికి ట్రెండ్‌గా కొనసాగుతున్నాయి. యువీ ప్రొటెక్టెడ్‌ సన్‌గ్లాసె్‌స, బకెట్‌ హ్యాట్స్‌, స్మార్ట్‌ వాటర్‌ బాటిల్స్‌ తీసుకువెళ్లడం వంటివి స్టేటస్‌ సింబల్‌గా మారాయి.


cITY4.3.jpgమైక్రో వర్కేషన్‌ ట్రెండ్‌

వేసవిలో హిల్‌ స్టేషన్లకు వెళ్లడం సాధారణం. కానీ ప్రస్తుతం మైక్రో వర్కేషన్స్‌ను ఇష్టపడుతున్నారు. దగ్గరలోని హిల్‌ స్టేషన్స్‌ లేదంటే రిసార్ట్స్‌కు వెళ్లి ఎంజాయ్‌ చేస్తూనే తమ ఆఫీసు పనులు కూడా చక్కబెడుతున్న ధోరణి పెరిగింది.

క్విక్‌ కామర్స్‌ జోరు

ఎండలకు షాపింగ్‌ చేయాలంటేనే పెద్ద సమస్యగా భావిస్తున్నారు. క్విక్‌ కామర్స్‌ అందుబాటులోకి వచ్చిన తరువాత వెజిటేబుల్స్‌ మొదలు ఎలకా్ట్రనిక్స్‌ వరకూ అన్నీ వాటిలోనే చూసి కొనుగోలు చేస్తున్నారు.


ఇంటి నుంచే పనులు..

ప్రస్తుతం బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఇంట్లోనే ఎక్కువగా గడపటానికి మొగ్గు చూపుతున్నారు. వినోదం, ఆహారం, వ్యాపారం అన్నీ ఇంటి నుంచే చేస్తున్నారు. యోగా చేయాలా యాప్‌ ఉందిగా అంటున్నారు. ఇంట్లోనే మినీ జిమ్‌ ఏర్పాటు, వినోదం కోసం ప్రొజెక్టర్లు, సౌండ్‌బాక్స్‌లు వినియోగిస్తున్నారు.

బయటికెళ్లే సమయాల్లో మార్పులు

సాధారణంగా ఉదయం 9.30-11గంటల మధ్య రోడ్లపై ట్రాఫిక్‌ రద్దీ అధికంగా ఉంటుంది. ఎండల నేపథ్యంలో కొద్ది రోజులుగా ఈ సమయాల్లో కాస్త మార్పులు కనిపిస్తున్నాయి. ఎండ దెబ్బ కొట్టక ముందే ఆఫీసుకు వెళ్లాలి అనే ధోరణి పెరిగింది. ఇక మధ్యాహ్నం సమయంలో తప్పదు అనుకుంటే తప్ప రోడ్ల మీదకు రావడం లేదు.


ఈ వార్తలు కూడా చదవండి:

బీర్ సీసాలో కండోమ్ ప్యాకెట్ కలకలం..

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. బాపట్ల యువకుడి మృతి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 20 , 2026 | 10:31 AM