30 కిలోల అడవి జంతువుల మాంసం పట్టివేత.. ఫారెస్ట్ అధికారుల చర్యలు
ABN , Publish Date - Jun 22 , 2026 | 11:25 AM
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని కాకతీయనగర్‌లో అడవి జంతువుల మాంసం విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో అటవీశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే అధికారుల రాకను గమనించిన కొందరు స్మగ్లర్లు అక్కడి నుంచి పరారయ్యారు.
మహబూబాబాద్ జిల్లా, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని కాకతీయనగర్‌లో అడవి జంతువుల మాంసం విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో అటవీశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే అధికారుల రాకను గమనించిన కొందరు స్మగ్లర్లు అక్కడి నుంచి పరారయ్యారు.
అధికారుల తనిఖీ సమయంలో మాంసం విక్రయిస్తున్న ఒక వ్యక్తిని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌తో వేటగాళ్లు వాగ్వాదానికి దిగారు. పరిస్థితిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ చేపట్టారు. అధికారుల తనిఖీల్లో సుమారు 30 కిలోల అడవి జంతువుల మాంసంతో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై సంబంధిత అటవీ చట్టాల కింద అధికారులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అడవి జంతువుల వేట, మాంసం విక్రయం, రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వన్యప్రాణుల సంరక్షణకు భంగం కలిగించే చర్యలను అరికట్టేందుకు ప్రజలు కూడా సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే సమాచారం అందించాలని అటవీశాఖ అధికారులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆరోగ్యానికి యోగానే ఉత్తమ మార్గం: బండి సంజయ్
ఆరోగ్య తెలంగాణకు యోగానే మార్గం: మంత్రి పొన్నం ప్రభాకర్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News