Share News

24న హనుమకొండలో కేటీఆర్‌ సభ

ABN , Publish Date - Nov 07 , 2026 | 11:59 AM

ఈనెల 24న హనుమకొండలో బీఆర్‌ ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కల్వ కుంట్ల తారకరామారావు (కేటీఆర్‌) పాల్గొననున్న సభను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు కసరత్తు ముమ్మరం చేశారు.

24న హనుమకొండలో కేటీఆర్‌ సభ
KTR Hanamkonda Meeting

  • ఏర్పాట్లపై బీఆర్‌ఎస్‌ నేతల కసరత్తు

హనుమకొండ: ఈనెల 24న హనుమకొండలో బీఆర్‌ ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కల్వ కుంట్ల తారకరామారావు (కేటీఆర్‌) పాల్గొననున్న సభను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు కసరత్తు ముమ్మరం చేశారు. సభ నిర్వహణకు అనువైన స్థలాల ఎంపికపై దృష్టి సారించినట్లు తెలిపారు. భారీ జన సమీకరణతో సభను నిర్వహించి పార్టీ శ్రేణు ల్లో నూతనోత్సాహం నింపడంతో పాటు రాజకీయంగా తమ బలాన్ని చాటుకోవాలని బీఆర్‌ఎస్‌ నాయకులు భావిస్తున్నారు.


hnk1.2.jpgసభ నిర్వహణకు సంబంధించి హనుమకొండలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల క్రీడా మైదానం, కాకతీయ ప్రభుత్వ కళాశాల (కేడీసీ) క్రీడా మైదానాలను బీఆర్‌ఎస్‌ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ భాస్కర్‌, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్‌ పరిశీలించారు. సభకు హాజరయ్యే కార్యకర్తలు, ప్రజలకు ఇబ్బందులు కలగ కుండా పార్కింగ్‌ స్థలాలకు సంబంధించి ఇ ప్పటికే రెండుచోట్ల అధికారుల నుంచి అను మతులు తీసుకున్నట్లు సమాచారం. కేటీఆర్‌ సమక్షంలో ఓ ప్రైవేటు విద్యాసంస్థల అధినేత సుమారు 10 వేల మందికి పైగా కార్యకర్తల తో చేరనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

దీపావళికి స్వీట్లు, డ్రైఫ్రూట్స్‌ అమ్మకాల్లో రికార్డులు

చర్లపల్లి-రక్సాల్‌ మధ్య ఆరు ప్రత్యేక రైళ్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 11:59 AM