Share News

రాప్తాడు బాలిక ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన మంత్రి నారా లోకేశ్

ABN , Publish Date - Nov 07 , 2026 | 11:13 AM

రాప్తాడు బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఆమె ఆరోగ్యం మెరుగవుతోందని.. అందుకు చాలా సంతోషంగా ఉందని మంత్రి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

రాప్తాడు బాలిక ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన మంత్రి నారా లోకేశ్
rapthadu victim health update

అమరావతి, నవంబర్ 7: సోషల్ మీడియా వేదికగా మంత్రి నారా లోకేశ్.. రాప్తాడు బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. బాలిక ఆరోగ్యం మెరుగవుతోందని.. ఆమె త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.


‘రాప్తాడు విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది. చిన్నారి బాగుంది. స్పృహలో ఉంది. ఈ రోజు హాయిగా కుర్చీలో కూర్చొంది. డాక్టర్లు ఆమెకు ఘన ఆహారపదార్థాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ రోజు ఆమె కొన్ని అడుగులు కూడా వేసింది. మరికొన్ని అడుగులు వేసేలా ఆమెను ఉత్సాహపరుస్తారని ఆశిస్తున్నా. బాలిక క్షేమం కోసం ప్రార్థనలు చేసిన అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు’ అని నారా లోకేశ్ పేర్కొన్నారు.

Updated Date - Nov 07 , 2026 | 11:20 AM