ఎన్టీఆర్ జిల్లాలో ప్రశాంతంగా పరిషత్ ఎన్నికల కౌంటింగ్: కలెక్టర్
ABN , Publish Date - Nov 07 , 2026 | 11:47 AM
ఎన్టీఆర్ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశా తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 8 కౌంటింగ్ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లతో ఓట్ల లెక్కింపు జరుగుతోందన్నారు.
ఎన్టీఆర్ జిల్లా, నవంబర్ 7: ఎన్టీఆర్ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశా తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 8 కౌంటింగ్ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లతో ఓట్ల లెక్కింపు జరుగుతోందన్నారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు దాదాపు పూర్తైందన్నారు.
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో పాటు బ్యాలెట్ పేపర్ల ఇనిషియల్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైందని కలెక్టర్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. కౌంటింగ్ వేగవంతంగా, సజావుగా జరిగేలా తగిన సంఖ్యలో కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు నిర్వహణ జరుగుతోందన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుతంగా జరిగేలా అన్ని చర్యలు చేపట్టామని కలెక్టర్ లక్ష్మీశా పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
బ్యాలెట్ బాక్సులో గ్రామ సమస్యల స్లిప్పులు.. పల్నాడులో ఆసక్తికర సన్నివేశం
ఏపీ పరిషత్ ఎన్నికల సీసీటీవీ ఫుటేజ్ 60 రోజులు భద్రపరుస్తాం: ఎస్ఈసీ అనిల్ చంద్ర
Read Latest AP News And Telugu News