ఏపీ పరిషత్ ఎన్నికల కౌంటింగ్.. పోస్టల్ బ్యాలెట్లో టీడీపీ హవా
ABN , Publish Date - Nov 07 , 2026 | 10:39 AM
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేపట్టారు. పోస్టల్ బ్యాలెట్లో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.
అమరావతి, నవంబర్ 7: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేపట్టారు. పోస్టల్ బ్యాలెట్లో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం ఎంపీటీసీ స్థానంలో 24 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు అవగా.. టీడీపీకి 19 ఓట్లు పోలవగా.. వైసీపీకి 5 ఓట్లు వచ్చాయి. అలాగే జడ్పీటీసీ స్థానంలో మొత్తం 26 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు అవగా.. టీడీపీకి 18 ఓట్లు వచ్చాయి. అలాగే వైసీపీకి 7, కాంగ్రెస్‌కు 1 ఓటు వచ్చింది.
నంద్యాల జిల్లా నంద్యాల మండలం జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో మొత్తం 23 ఓట్లు పోలవగా.. టీడీపీకి 15, వైసీపీకి 8 ఓట్లు నమోదు అయ్యాయి. అలాగే ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీకి15 ఓట్లు పోలవగా.. వైసీపీకి 7 వచ్చాయి. అలాగే నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు పూర్తైంది. పోస్టల్ బ్యాలెట్లో టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. టీడీపీకి 85 ఓట్లు, వైసీపీకి 45 ఓట్లు రాగా.. బీఎస్పీకి ఒక ఓటు వచ్చింది. అలాగే రెండు ఓట్లు తిరస్కరించారు. గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలంలో ఎంపీటీసీకి పోస్టల్ బ్యాలెట్లో మొత్తం 66 ఓట్లు పోలవగా.. అందులో టీడీపీకి 45, వైసీపీకి16, జనసేనకు 4, బీజేపీకి 1 ఓటు పోలైంది.
నెల్లూరు జిల్లాలోని దుత్తలూరు మండలం జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు పూర్తైంది. టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. టీడీపీకి 52 ఓట్లు, వైసీపీకి 11 ఓట్లు రాగా.. మూడు ఓట్లు నోటా కింద వచ్చాయి. దగదర్తి మండలంలో పోస్టల్ బ్యాలెట్లలో మొత్తం 56 ఓట్లు పోలయ్యాయి. టీడీపీకి 26, వైసీపీకి 10, జనసేనకి 5 ఓట్లు వచ్చాయి. ఒక ఓటు నోటా కింద నమోదైంది. అనకాపల్లి జిల్లా మునగపాక జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో 79 ఓట్లు పోలయ్యాయి. అందులో టీడీపీకి 26, వైసీపీకి19 ఓట్లు రాగా.. 34 చెల్లని ఓట్లు నమోదు అయ్యాయి.
ఇవి కూడా చదవండి...
ఆ వార్డుల్లో రీపోలింగ్‌కు ఆదేశించలేం
బ్యాలెట్ బాక్సులో గ్రామ సమస్యల స్లిప్పులు.. పల్నాడులో ఆసక్తికర సన్నివేశం
Read Latest AP News And Telugu News