Share News

అత్తాపూర్‌లో బైక్‌ను ఢీకొట్టిన వాహనం.. ఒకరికి తీవ్ర గాయాలు

ABN , Publish Date - Nov 07 , 2026 | 09:12 AM

మెహదీపట్నం సమీపంలోని అత్తాపూర్ రోడ్డులో పీవీఎన్ఆర్ పిల్లర్ నంబర్ 99 వద్ద ఘోర ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం బైక్‌ పై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది.

అత్తాపూర్‌లో బైక్‌ను ఢీకొట్టిన వాహనం.. ఒకరికి తీవ్ర గాయాలు

హైదరాబాద్, నవంబర్ 07: మెహదీపట్నం సమీపంలోని అత్తాపూర్ రోడ్డులో పీవీఎన్ఆర్ పిల్లర్ నంబర్ 99 వద్ద ఘోర ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం బైక్‌ పై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. తలకు బలమైన గాయం కావడంతో.. తీవ్ర రక్తస్రావమైంది. దీంతో అతడు అపస్మాకర స్థితిలోకి వెళ్లాడు.


అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. 108తోపాటు పోలీసులకు కాల్ చేశారు.108 వాహనంలో అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను వారు పరిశీలిస్తున్నారు. బాధితుడికి సంబంధించిన వివరాలు తెలియలేదని పోలీసులు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పెరిగిన బంగారం ధర..

సంప్రదాయ వస్త్రాలు ధరిస్తేనే అప్పన్న దర్శనం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 09:26 AM